velppurisrinivas-_kapu-netha

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,జనవరి 6,2023: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం కాకుండా అడ్డుకోవడం కోసమే కేసీఆర్ డైరెక్షన్ లో జగన్ యాక్షన్ చేస్తున్నారని సౌత్ ఇండియా కాపు సంఘం ప్రధాన కార్యదర్శి వేల్పూరి శ్రీనివాసరావు విమర్శించారు.

ఇలాంటి కుట్రలు చేయడం సిగ్గుచేటని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ లో ఏపీ నేతలు చేరడానికి జగన్ కారణం అని, తెలంగాణలో ఉన్న అక్రమ ఆస్తులను కాపాడుకోవాలని కేసీఆర్ కి పాలేరుగా జగన్ పనిచేస్తున్నారని, 2019ఎన్నికల్లో కేసీఆర్ ఆర్థిక సహాయంతోనే జగన్ విజయం సాధించడం జరిగింది అని వేల్పూరి అన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతోంది అని, అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం వల్ల ఆంధ్రప్రదేశ్ కు నష్టం లేదని చెప్పడం సీఆర్ కు జగన్ కట్టు బానిస అయ్యారని అదే విషయాన్ని నిరూపిస్తున్నారని అన్నారు.

velppurisrinivas-_kapu-netha

గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సలహాలు, కేసీఆర్ ఆర్థిక సహాయం తోనే జగన్ గెలిచారని, 2024 ఎన్నికల్లో ఓటుకు10వేల రూపాయలు ఇచ్చినా, జగన్ గెలవలేడని వేల్పూరి దుయ్యబట్టారు.

పవన్ కళ్యాణ్ “వారాహి రథ యాత్రను అడ్డుకునేందుకు జగన్ చీకటి జిఓ తీసుకు వచ్చారని వేల్పూరి జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ కలిసి ఎన్ని కుట్రలు చేసినా, కాపులు సామాజిక న్యాయం కోసం పవన్ కళ్యాణ్ కు మద్దత్తు ఇవ్వటం జరుగుతుందని వేల్పూరి శ్రీనివాస్ తెలిపారు.

విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన లక్ష కోట్లను కేసీఆర్‌కు జగన్ ధారదత్తం చేశాడని, పోలవరం ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డి కేసీఆర్, జగన్ ల బినామీ అని ఆయన ఆరోపించారు.