365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జనవరి 7,2023: తెలంగాణ రాష్ట్రం ఆయిల్ పామ్ సాగులో రికార్డు నెలకొల్పింది. కేవలం ఏడాదిలో దేశంలోని ఒక రాష్ట్రంలో 50వేల ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటి రికార్డు సృష్టించిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేక్ కట్ చేసి ఉద్యానవ అధికారులు, సంబంధిత కంపెనీలకు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఆయిల్ పామ్ సాగుపై శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉద్యాన శాఖ నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విడుదల చేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు , ఉద్యాన శాఖ డైరెక్టర్ హనుమంతరావు , ఆయిల్ ఫెడ్ సురెందర్, జేడీ సరోజిని, ఉద్యాన శాఖ అధికారులు, ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణరాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
మార్చి లోపు 1.2 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్..11ఆయిల్ పామ్ కంపెనీల ద్వారా 1502 ఎకరాలలో 38 ఆయిల్ పామ్ మొక్కల నర్సరీల ఏర్పాటు. ఆయిల్ పామ్ మొక్కలు నాటేందుకు అందుబాటులో నిధులు. కేవలం ఏడాదిలో 52 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటి రికార్డు సృష్టించిన తెలంగాణ. వచ్చే మూడు నెలలలో 70 వేల ఎకరాలలో మొక్కలు నాటడం పూర్తికావాలి.
2023 – 24 లో నాటేందుకు అందుబాటులో కోటి ఆయిల్ పామ్ మొక్కలు. ఇవి మరో లక్ష 50 వేల ఎకరాలకు సరిపోతాయి. ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు ఆయిల్ ఫెడ్ ద్వారా 458 ఎకరాల భూమి సేకరణ.
నిర్మల్, వనపర్తి, మంచిర్యాలలలో ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు ప్రీ యూనిక్, మ్యాట్రిక్స్ కంపెనీలకు టీఎస్ ఐఐసీ ద్వారా భూమి కేటాయింపునకు ప్రభుత్వ ఆమోదం తెలిపారు.
మిగతా కంపెనీలకు ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు భూమి కేటాయించేందుకు ధరఖాస్తుల పరిశీలన చేశారు మంత్రి.
ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు దృష్టిపెట్టాలి. కంపెనీలు గ్రామాల వారీగా అవగాహనా సమావేశాలు నిర్వహించాలి.. రైతువేదికలలో శిక్షణలు ఇప్పించాలి.
ఆయిల్ పామ్ మీద ఆదాయం వచ్చే వరకు రైతులు అంతర పంటలు వేసుకునేందుకు రైతులకు అవగాహన, చైతన్యం కల్పించాలి. కామారెడ్డి జిల్లా బొప్పాస్ పల్లి విత్తన క్షేత్రంలో ఆయిల్ పామ్ రీసెర్చ్ గార్డెన్ ఏర్పాటుకు నిర్ణయం..
http://dhunt.in/I5E0Yనల్లగొండ జిల్లా డిండి వ్యవసాయ క్షేత్రం, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం మాల్ తుమ్మెద విత్తన క్షేత్రంలో ఆయిల్ పామ్ మొక్కల క్షేత్రాల ఏర్పాటు పరిశీలనకు అధికారులను మంత్రి ఆదేశించారు.