Fri. Dec 13th, 2024
Gopizza

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌, జనవరి 13, 2023 : అత్యంత ప్రాచుర్యం పొందిన కొరియన్‌ హెచ్‌క్యు పిజ్జా బ్రాండ్‌ గోపిజ్జా, తమ మొట్టమొదటి స్టోర్‌ను తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ ఔట్‌లెట్‌ను హైటెక్‌ సిటీలోని శరత్‌ సిటీ మాల్‌, రెండవ అంతస్తులో ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నటి మధుషాలినీ ముఖ్య అతిథిగా హాజరుకావడంతో పాటుగా గోపిజ్జాను ప్రారంభించారు. భారతదేశపు మార్కెట్‌లో వేగంగా విస్తరించాలని ప్రణాళిక చేసిన గోపిజ్జా, హైదరాబాద్‌లో ఈ ఔట్‌లెట్‌ ప్రారంభించడం ద్వారా తమ తొలిఅడుగు వేసింది.

దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌ జిల్లా రేగటిపల్లిలో కూడా ఓ ఔట్‌లెట్‌ ప్రారంభించింది. గోపిజ్జా తమ ప్రస్తుత 20 విజయవంతమైన స్టోర్స్‌ నుంచి వృద్ధి చెందాలనుకుంటుంది. ఈ క్రమంలోనే 2023 సంవత్సరాంతానికి భారతదేశ వ్యాప్తంగా 100 నిర్వహణలోని ఔట్‌లెట్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

దక్షిణ కొరియాలో ఈ సంస్ధ ఫౌండర్‌ జే వోన్‌ (జే)లిమ్‌ ఫుడ్‌ ట్రక్‌ వద్ద ఓ ఆలోచనలా ప్రారంభమైన ఈ పిజ్జా ఇప్పుడు దక్షిణ కొరియా, సింగపూర్‌, ఇండోనేషియా, ఇండియా, హాంగ్‌కాంగ్‌లలో 200కు స్టోర్లతో ఎక్కువ మంది అభిమానించే పిజ్జా బ్రాండ్‌గా నిలిచింది.

Gopizza

గోపిజ్జా తమ నాణ్యత, ప్రామాణికతను ప్రతిప్రాంతంలోనూ నిర్వహిస్తుంది. దీని పేటెంటెడ్‌ అంతర్గత సాంకేతికత ‘ద గోవెన్‌’ దీనికి తోడ్పడుతుంది. గోవెన్‌ అనేది ఆటోమేటిక్‌ పిజ్జా ఓవెన్‌. గోబోట్‌ అనేది కోఆపరేటివ్‌ రోబో, అలాగే ఏఐ స్మార్ట్‌ టాపింగ్‌ టేబుల్‌ సమయానికి, ప్రామాణిక నాణ్యత , సేవలను అన్ని ఔట్‌లెట్ల వద్ద అందిస్తుందనే భరోసా అందిస్తుంది.

గోపిజ్జా, తమ సింగిల్‌ సర్వ్‌, ఫైర్‌ బేక్డ్‌ పిజ్జాను అందుబాటు ధర,వేగవంతమైన సర్వింగ్‌ స్పీడ్‌తో అందిస్తుంది.

ఈ సందర్భంగా గోపిజ్జా ఇండియా సీఈఓమహేష్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌కు గోపిజ్జాను తీసుకురావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. కేవలం తాజా పదార్ధాలు మాత్రమే వాడడంతో పాటుగా మా వినూత్నమైన ఫ్లేవర్స్‌ను అత్యంత సరసమైన ధరలలో అందించనున్నామన్నారు.

అది మమ్మల్ని ఎక్కువ మంది అభిమానించే పిజ్జా బ్రాండ్‌గా మార్చింది. ఈ పిజ్జాలను హైదరాబాద్‌ వాసులు ఆస్వాదించడానికి చూపే ఆసక్తిని చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము.

స్ధానిక కమ్యూనిటీ వద్ద మా మెనూ విజయవంతమవుతుందని ఆశిస్తున్నాము. అంతేకాదు, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగర ఆహార దృశ్యంలో భాగం కావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.

తెలంగాణాలో కంపెనీ భావి ప్రణాళికలను గురించి మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘మాకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన వృద్ధి మార్కెట్‌లుగా తెలంగాణా , ఏపీ నిలుస్తున్నాయి. రాబోయే రెండు సంవత్సరాలలో ఈ రెండు రాష్ట్రాలలో 50 నూతన ఔట్‌లెట్లు ప్రారంభించనున్నాము’’ అని అన్నారు.

error: Content is protected !!