365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 27, 2023: బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత మొదటి సారిగా భారతదేశ పౌరులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అందించారు. ఇది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కృషితోనే దేశంలోని ప్రతి పౌరునికి రక్షణ కల్పించడానికి రాజ్యాంగం ద్వారా రూపొందించడం జరిగిందని రాజేంద్రనగర్ సీనియర్ బీజేపీ నాయకులు బుక్క వేణుగోపాల్ అన్నారు. ఆయన 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేశారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్య్ర సమర యోధులు చేసిన త్యాగాలకు భారత పౌరుడిగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.
డాక్టర్ వల్లభాయ్ పటేల్ కృషి లేకుంటే దేశం ముక్కలయ్యేది. అన్ని సంస్థానాలను భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ విలీనం చేసేందుకు తనవంతుగా కృషి చేశారని, లేకుంటే, మన ప్రాంతం మరో పాకిస్తాన్‌గా మారి ఉండేదని చెప్పారు.
భారతీయ పతాకం ఆకాశంలోకి ఎగురుతున్న ప్రతిసారీ, మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య భారత పతాకాన్ని రూపొందించారని ఆయన్ను స్మరించుకుంటూ గర్వపడాలని బుక్క వేణుగోపాల్ తెలిపారు.