365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగళూరు, జనవరి 29,2023: ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా సరికొత్త ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టనుంది. “Moto E13” పేరుతో ఫిబ్రవరి మొదటి వారంలో భారతదేశంలో లాంచ్ చేయనుంది. భారతదేశంలో Moto E13 లాంచ్‌ను అధికారికంగా ప్రకటించ లేదు.
అయితే కొత్త లీకైన నివేదిక ఫోన్ ఫీచర్స్ వెల్లడించింది. Moto E13ని ఇటీవల యూరప్, మధ్య ఆసియా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికన్ మార్కెట్లలో ప్రారంభించారు.
ఇప్పుడు Moto E13 భారతదేశానికి రావడానికి సిద్ధంగా ఉంది. Moto E13 వచ్చే నెల ప్రారంభంలో భారతదేశంలో లాంచ్ అవుతుందని చెబుతున్నారు. Moto E13 4 GB RAM , 64 GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇండియాలో Moto E13 ధర సుమారు రూ.10,000 ఉండవచ్చు.
Moto E13 ఫిబ్రవరి మొదటి వారంలో భారతదేశంలో లాంఛ్ అవ్వనున్నది. Moto E13 4 GB RAM, 64 GB స్టోరేజ్‌తో ఉంటుంది. Moto E13 ధర సుమారు రూ. 10,000 ఉండవచ్చని అంచనా.
Moto E13 యూరోప్‌లో 119.99 యూరోలు అంటే దాదాపు దీని ధర రూ. 10,600గా ఉంది. కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ రంగులలో వస్తుంది.
Moto E13 ఫీచర్స్..
Moto E13 డ్యూయల్ నానోసిమ్ సపోర్ట్ తో వస్తుంది. ఫోన్ ముందే ఇన్స్టాల్ చేసిన SIM కార్డ్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్‌ను కలిగి ఉంది. Moto E13 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల IPS LCD HD + డిస్ప్లేను కలిగి ఉంది.
ఫోన్లో Unisoc T606 ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం Mali-G57 MP1 GPU అండ్ 2GB RAMతో 64GB స్టోరేజ్, Moto E13లో 13 మెగాపిక్సెల్‌ల సింగిల్ రియర్ కెమెరా ఉంది. దీని ఎపర్చరు f/2.2. ఫోన్లో 5 మెగాపిక్సెల్‌ల ఫ్రంట్ కెమెరా ఉంది.
Moto E13 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 36 గంటల బ్యాకప్ ఉంటుంది. 10W ఛార్జింగ్ కూడా ఉంది. ఫోన్ మొత్తం బరువు 179.5 గ్రాములు. Moto E13 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడాఉంది. వాటర్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్ తో వస్తుంది.