Rail_ticket

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ, ఫిబ్రవరి 4,2023: ప్రతిరోజు లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తుంటారు. సౌకర్యవంతమైన సీట్లు, టాయిలెట్ , క్యాటరింగ్ ఏర్పాట్లు, ఏసీ మొదలైనవి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి.

ట్రైన్ లో ప్రయాణించడానికి తప్పనిసరిగా రైలు టిక్కెట్‌ ఉండాలి. మీకు టికెట్ లేకపోతే, Travelling ticket examiner (TTE) ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ మీకు జరిమానా విధించవచ్చు.

ఐతే అదే స‌మ‌యంలో రైల్వే పోలీసులు కూడా ప్ర‌యాణికుల టిక్కెట్ల‌ను చెక్ చేయ‌వచ్చా..? లేదా అనే ప్ర‌శ్న చాలా మంది మదిలో మెదులుతుంది. దీనికి సంబంధించి రూల్స్ ఏమి చెబుతున్నాయి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Rail_ticket

రైల్వే నిబంధనల ప్రకారం ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)మాత్రమే ప్రయాణీకుల టిక్కెట్ తనిఖీ చేయగలరు. టిక్కెట్లను తనిఖీ చేసే అధికారం రైల్వే పోలీసులకు ఉండదు.

మరి రైల్వే పోలీసుల పని ఏమిటి?

వాస్తవానికి, రైల్వే పోలీసుల పని ప్రయాణికులను రక్షించడం, ట్రైన్ లో అల్లర్లు , గొడవలు జరిగినప్పుడు మాత్రమే రైల్లో ప్రయాణించే ప్యాసింజర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడమే వాళ్ల ప్రధాన విధి. వారు ఏ ప్రయాణీకుల టిక్కెట్‌ను ఎప్పుడూ తనిఖీ చేయలేరు.

టిక్కెట్లను ఎవరు తనిఖీ చేయవచ్చు?

నిబంధనల ప్రకారం రైలులో ప్రయాణించే ప్రయాణికుల టిక్కెట్లను తనిఖీ చేసే హక్కు టీటీఈకి మాత్రమే ఉంటుంది. ప్రయాణికుడి వద్ద టిక్కెట్ లేకపోతే, జరిమానా విధించే హక్కు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)కి మాత్రమే ఉంది.

Rail_ticket

రైల్వే పోలీసులు మిమ్మల్నిటిక్కెట్లు అడిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలి..?

రైల్వే పోలీసులు మిమ్మల్ని టికెట్ అడిగినా, బెదిరించినా, బెదిరింపులకు గురి చేసినా మీరు టీటీఈకి లేదా రైల్వే అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.

మరోవైపు, మీ నుంచి జరిమానా లేదా టిక్కెట్ డబ్బులు తీసుకుని, టీటీఈ స్లిప్ లేదా టిక్కెట్ ఇవ్వకపోతే, మీరు దాని గురించి రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.