Fri. Nov 22nd, 2024
KCR_HARISH_GADALASRINIVAS365t

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ, ఫిబ్రవరి 7,2023: తెలంగాణ రాష్ట్ర చ‌రిత్ర‌లోనే వైద్యారోగ్య శాఖ‌కు రికార్డు స్థాయిలో రూ.12,161 కేటాయించినందుకు ముఖ్యమంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు కు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు గ‌డ‌ల శ్రీ‌నివాస రావు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

గత ఏడాదితో పోల్చితే రూ.721 కోట్లు అధికంగా కేటాయింపులు జ‌రిగాయి. ఇందుకు కృషి చేసిన ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు ఆయన.

“తాజా బ‌డ్జెట్ కేటాయింపులు ఆరోగ్య తెలంగాణ సాధ‌న దిశ‌గా మ‌రింత దోహ‌దం చేయ‌నున్నాయి. వైద్య రంగంలో మ‌రిన్ని విప్ల‌వాత్మ‌క మార్పులకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాయి.

జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్న ప్ర‌భుత్వం.. ఈ బ‌డ్జెట్ లో వాటికి అనుబంధంగా న‌ర్సింగ్ కాలేజీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం హ‌ర్ష‌నీయం”అని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు గ‌డ‌ల శ్రీ‌నివాస రావు అన్నారు.

ఈ నిర్ణ‌యం రాష్ట్రంలో వైద్య విద్య‌ను మెరుగుప‌రచ‌డంతోపాటు తెలంగాణ బిడ్డ‌లకు ఉపాధి క‌ల్ప‌న‌కు బాట‌లు వేస్తుంది. గ‌ర్భిణుల్లో ఎనీమియా నివార‌ణ‌కు 9 జిల్లాల్లో ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ల ప‌థ‌కాన్ని రాష్ట్ర‌మంతా విస్త‌రించ‌డం గొప్ప విష‌యంఅని ఆయన వెల్లడించారు.

KCR_HARISH_GADALASRINIVAS365t

ఇది గ‌ర్బిణుల్లో ర‌క్త‌హీన‌త‌ను నివారించ‌డంతోపాటు.. మాతాశిశు మ‌ర‌ణాల‌ను నియంత్రించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. దీని కోసం 200 కోట్లు కేటాయించడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు. 4 లక్షల మంది గర్భిణులకు ఇది వరం కానున్నదని గ‌డ‌ల శ్రీ‌నివాస రావు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న 350 బస్తీ దవాఖనలకు అదనంగా మరో 100 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం వల్ల ఎంతో మంది పట్టణ బస్తీ ప్రజలకు వైద్య మరింత చేరువ కానున్నదని, సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని మా వైద్యారోగ్య శాఖ సిబ్బంది

మ‌రింత ఉత్సాహంతో ప‌నిచేసి ఆరోగ్య తెలంగాణను ఆవిష్క‌రించేందుకు మా వంతు పాత్ర పోషిస్తామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు గ‌డ‌ల శ్రీ‌నివాస రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా కృషి చేసి ఆరోగ్య తెలంగాణ లక్ష్యాన్ని సాకారం చేస్తామని ఆయన వెల్లడించారు.

error: Content is protected !!