Sun. Dec 22nd, 2024
Yerrupalem_MPP365Telugu

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఖమ్మం, ఫిబ్రవరి 9,2023 : ఎర్రుపాలెంఎంపీపీ దేవరకొండ శిరీష ఎమ్మార్పీఎస్ నాయకుడు దేవరకొండ వెంకటేశ్వర్లు కుటుంబానికి నిత్యవసరాలు, నగదు అందించారు.

ఎర్రుపాలెం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు దేవరకొండ వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ ఖర్చుల నిమిత్తం ఆ కుటుంబానికి, నగదు, ఒక నెలకు సరిపడా నిత్యవసరాలు అందించారు.

Yerrupalem_MPP365Telugu

ఈ సందర్భంగా ఎర్రుపాలెం ఎంపీపీ దేవరకొండ శిరీష మాట్లాడుతూ వెంకటేశ్వర్లు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దగోపవరం ఎంపీటీసీ సగ్గుర్తి కిషోర్,సగ్గుర్తి ముత్యాలరావు, దేవరకొండ రవి తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!