Sat. Dec 28th, 2024
Baldhead_Judgement365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఇంటర్నేషనల్, ఫిబ్రవరి 13, 2023: బ్రిటన్‌లో ఓ వింత కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఒక వ్యక్తికి బట్టతల ఉందన్న కారణంతో అతనిని ఉద్యోగం నుంచి తొలగింగించింది ఓ సంస్థ.

యూకేకు చెందిన ఒక వ్యక్తి బట్టతల కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన విచిత్రమైన సంఘటన ఇది. ఇంగ్లండ్‌లోని లింగో నెట్‌వర్క్స్ లిమిటెడ్ అనే కంపెనీలో జరిగిన ఈ ఘటన విన్నవాళ్ళందరూ ఆశ్చర్య పోతున్నారు.

అయితే ఉద్యోగం కోల్పోయిన ఆ వ్యక్తికి న్యాయస్థానం తగిన న్యాయం చేయడమేకాకుండా మరోమారు ఇలాంటి సంఘటనలు జరగకకుండా విచిత్రమైన తీర్పు ఇచ్చింది కోర్టు.

తమ కంపెనీలో 50 ఏళ్లు పైబడిన బట్టతల ఉన్నవాళ్లు పనిచేయకూడదంటూ మేనేజర్ వారిని బయటకు బలవంతంగా పంపించారు. దీంతో చాలా మంది ఉద్యోగులు షాక్ గురయ్యారు.

Baldhead_Judgement365

దానికి వ్యతిరేకంగా ఆ బాధితుడు న్యాయస్థానం ద్వారా గుణపాఠం చెప్పాడు. అంతేకాదు ఆ సంస్థకు రూ.70 లక్షల మేర జరిమానా విధించి ఆ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

కంపెనీలో యువత ఉంటే పని వేగంగా జరుగుతుందని, అందుకే ఈ వంకతో ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు నష్టాలు ఎదుర్కోవడంతో సరైన కారణం లేకుండానే తమ ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతున్నాయి.

వారిని ఏదో రకంగా కారణాలు చూపించి బలవంతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూనే ఉన్నాయి. అలాంటి కంపెనీలకు యూకే కోర్టు ఇచ్చిన తీర్పు అలాంటి కంపెనీలకు తగిన గుణపాఠం చెప్పిందని అందరూ భావిస్తున్నారు.

error: Content is protected !!