Fri. Oct 18th, 2024
HPCL_Jobs

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ, ఫిబ్రవరి13, 2023: HPCL ముంబై రిక్రూట్‌మెంట్ 2023: HPCL అసిస్టెంట్ టెక్నీషియన్, అసిస్టెంట్ బాయిలర్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఫైర్ & సెక్యూరిటీ ఆపరేటర్స్ ,అసిస్టెంట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

HPCL ముంబై రిక్రూట్‌మెంట్ 2023: HPCL అసిస్టెంట్ టెక్నీషియన్, అసిస్టెంట్ బాయిలర్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఫైర్ & సెక్యూరిటీ ఆపరేటర్స్,అసిస్టెంట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

HPCL_Jobs

దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.hindustanpetroleum.com ద్వారా ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్‌ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25 వరకు అవకాశం ఉంది.

HPCL ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 60 ఖాళీల భర్తీకి నిర్వహిస్తోంది. వాటిలో 30 ఖాళీలు అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్, 07 ఖాళీలు అసిస్టెంట్ బాయిలర్ టెక్నీషియన్, 18 ఖాళీలు అసిస్టెంట్ ఫైర్ & సేఫ్టీ ఆపరేటర్ అండ్ అసిస్టెంట్ టెక్నీషియన్ ( ఎలక్ట్రికల్) మెయింటెనెన్స్ పోస్ట్ కోసం.

HPCL ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.

దీనితో పాటు, జనరల్, ఎక్స్-సర్వీస్‌మెన్, OBC-NC, EWS అభ్యర్థులు రూ. 590 దరఖాస్తు రుసుమును చెల్లించాలి. SC, ST, PwBD అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు లభిస్తుంది.

error: Content is protected !!