365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఖమ్మం,ఫిబ్రవరి17,2023: ఖమ్మం రూరల్ ప్రాంతం సాయి గణేష్ నగర్ లో గురువారం వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని వైయస్ విజయమ్మ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాత్కాలిక కార్యాలయాన్ని పాలేరులో ప్రారంభించుకున్నాం అని జూన్ 8వతేదీన మన సొంత కార్యాలయం ప్రారంభించుకుందాం అని అన్నారు.
వైయస్సార్ ప్రతి క్షణం పేదల గురించే ఆలోచించే వారు రాజన్న కుటుంబం అంటే జగమంత కుటుంబం అని తన జీవితంలో మాట తప్పని, మడమ తిప్పని వైయస్సార్ అడుగుజాడల్లో నడుస్తున్న షర్మిల కూడా మాట ఇస్తే ఎందాకైనా వెళ్తారని విజయమ్మ అన్నారు.
చిత్తశుద్దితో రాజకీయాలు చేయాలనే షర్మిల ప్రజాప్రస్థానం ఎన్ని అవమానాలు చేసినా అన్నిటినీ ఎదుర్కొని ముందుకు అడుగేస్తుంది. ప్రజాప్రస్థానం 4వేల కిమీ, అంతకు ముందు 3వేల కిమీ షర్మిల నడక వైయస్సార్ బంగారు పాలన కోసమే అని ఆమె పేర్కొన్నారు.

షర్మిల అడ్రస్ ఎక్కడా అంటే పాలేరు అనే చెప్తున్నాం. రానున్న షర్మిల రాజకీయాలకు పాలేరు గుమ్మం అవుతుంది. ప్రతి కుటుంబంలో షర్మిల ను గుండెలలో పెట్టుకుంటారని, షర్మిల 4కోట్ల తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుందని, వైయస్సార్ ప్రేమా, మానవత్వం షర్మిల ప్రజలకు పంచుతోంద”నిఅన్నారు. “పాలేరు నుండే తెలంగాణ ను పరిపాలిస్తుంది.
మంచి నాయకులుంటే మంచి పరిపాలన ఉంటుందని, వైయస్సార్ కు పాలేరుకు రూణానుబంధం ఉంది. ఎల్లప్పుడూ ఖమ్మం జిల్లా మాకు అండగానే నిలిచిందని , ఎప్పుడో వైయస్సార్ పాలనలో మొదలెట్టిన ప్రాజెక్టులు ఇప్పటిదాకా పూర్తి చేయలేకపోయారు.
షర్మిల చేతి మీదుగానే అవి ప్రారంభ మౌతాయనుకుంటా.. ఆంధ్రాలో పులివెందుల ఎలానో , తెలంగాణ లో పాలేరు అలానే అని అన్నారు విజయమ్మ.