Sun. Dec 22nd, 2024
Meta-365telugu

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,వాషింగ్టన్, ఫిబ్రవరి 20, 2023: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ మెటా కూడా ప్రీమియం వెరిఫికేషన్ సేవను ప్రకటించింది. మెటా కంటే ముందు, ట్విట్టర్ ప్రీమియం సేవ అయిన ట్విట్టర్ బ్లూ సేవను ప్రకటించింది.

ఈ రూల్ ప్రకారం వినియోగదారులు బ్లూ టిక్ వెరిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. మెటా కూడా ట్విట్టర్ బాటే పట్టింది. అయితే భారతదేశంలో మెటా ప్రీమియం సేవలకు ఎంత ఖర్చవుతుంది. అనేది తెలియాల్సి ఉంది.

అంటే, ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్ ,న్‌స్టాగ్రామ్ కూడా వెరిఫైడ్ అకౌంట్ అంటే బ్లూ టిక్ కోసం చెల్లించాల్సి ఉంటుంది. దీని ధర వెబ్ కోసం $11.99 (రూ. 993) iOS కోసం $14.99 (రూ. 1241)గా నిర్ణయించారు.

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లో సర్వీస్

న్యూజిలాండ్‌లలో ఈ సేవను మొదటిసారిగా ప్రారంభించనున్నట్లు కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. త్వరలో ఇతర దేశాల్లోనూ ఈ సర్వీస్‌ను ప్రారంభించనున్నారు. వినియోగదారులు తమ ప్రభుత్వ ID కార్డ్ ద్వారా వారి ఖాతాను ధృవీకరించగలరు.

Meta-365telugu

దీనికి బదులుగా, వినియోగదారు ఖాతాకు అదనపు భద్రత కూడా అందించడానికి అవకాశవం ఉంటుంది. అయితే, భారతదేశంలో ఈ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? అనేది తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ ఇప్పటికే ప్రకటించింది..

ఇంతకుముందు, మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఇటీవలే చెల్లింపు సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ట్విట్టర్ బ్లూ టిక్ ను ప్రారంభించింది. భారతదేశంలోని మొబైల్ వినియోగదారులు బ్లూ టిక్ పొందడానికి , ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ఫీచర్లను ఉపయోగించడానికి నెలకు రూ.900 చెల్లించాలి.

అదే సమయంలో, కంపెనీ 650 రూపాయలకు తక్కువ ధర ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కూడా విడుదల చేసింది. ఈ ప్లాన్ వెబ్ వినియోగదారుల కోసం. గత సంవత్సరం మాత్రమే కంపెనీ ట్విట్టర్ బ్లూను కొత్త రూపంలో విడుదల చేసింది. ఇది ముందుగా అమెరికా , యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , జపాన్‌తో సహా కొన్ని దేశాల్లో ప్రారంభించారు.

మొదటగా ఈ నగరాల్లో..

కంపెనీ మొదటగా యునైటెడ్ స్టేట్స్, కెనడా,యూకే,జపాన్, న్యూజిలాండ్ ,ఆస్ట్రేలియాతో సహా ఇతర దేశాలలో చెల్లింపు సభ్యత్వ సేవను ప్రారంభించింది.

Google Android వినియోగదారులు iOS వినియోగదారులు Twitter బ్లూ నెలవారీ సభ్యత్వాన్ని $11 (సుమారు రూ. 900)కి కొనుగోలు చేయాలని కంపెనీ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

error: Content is protected !!