365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మార్చి 7,2023: రోడ్డుపై సురక్షితంగా వాహనాలు నడవాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించడం తప్పనిసరి. ఈ నిబంధనలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి తెలుసుకోవడం ద్వారా ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా రోడ్ల మీద వాహనాలు నడపడానికి అవకాశం ఉంటుంది.
అయితే, ట్రాఫిక్ సిగ్నల్స్‌లో మూడు రంగులలైట్లను ఖచ్చితంగా వాడుతుంటారు. వీటిలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వంటి కలర్స్ మాత్రమే ఉంటాయి. ట్రాఫిక్ నిబంధనల విషయంలో కేవలం కొన్ని రంగులను ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా..?
ఈ మూడు రంగుల ట్రాఫిక్ లైట్లలో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఎరుపు రంగు ట్రాఫిక్ లైట్ అంటే మీరు వాహనాన్ని ఆపాలి. ట్రాఫిక్ లైట్ పసుపు రంగులో ఉన్నప్పుడు మీరు నడపడానికి సిద్ధంగా ఉండాలి.. ఆకుపచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకువెళ్లాలి.
1868 డిసెంబర్ 10న లండన్‌లోని బ్రిటీష్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ముందు ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాఫిక్ లైట్‌ను ఏర్పాటు చేశారు. జేకే నైట్ అనే రైల్వే ఇంజనీర్ ఈ లైట్‌లను అమర్చారు. అప్పుడు ట్రాఫిక్ లైట్లు రాత్రిపూట కనిపించేవి. అప్పట్లో ట్రాఫిక్ లైట్లలో రెండు రంగులు మాత్రమే వాడేవారు.
మొదటి సురక్షితమైన ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ట్రాఫిక్ లైట్లు 1890లో యునైటెడ్ స్టేట్స్‌లో ఏర్పాటు చేయశారు. అప్పటి నుంచి ప్రపంచంలోని ప్రతి దేశంలో ట్రాఫిక్ లైట్లను ఉపయోగించడం ప్రారంభించారు.
ట్రాఫిక్ సిగ్నల్స్‌లో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులను మాత్రమే ఎందుకు ఉపయోగిస్తున్నారంటే..? నిజానికి, ఇతర రంగులతో పోలిస్తే ఎరుపు రంగు చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది దూరం నుంచి కూడా కనిపిస్తుంది. ఎరుపు రంగు ముందుకు ప్రమాదం ఉందని సూచిస్తుంది. కాబట్టి మీరు మీ వాహనాన్ని ఆపాలని గుర్తించాలి.
ట్రాఫిక్ లైట్లలో పసుపు రంగు ను ఎందుకు ఉపయోగిస్తారు..? ఈ రంగు సూర్యుని శక్తి కి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ రంగు మీరు మీ వాహనాన్ని నడపడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది.
ఆకుపచ్చ రంగు ప్రకృతికి, శాంతికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ రంగు ట్రాఫిక్ లైట్లలో ఉపయోగిస్తారు ఎందుకంటే..? ఈ రంగు కళ్లకు ఓదార్పునిస్తుంది. ఈ లైట్ వెలిగితే ఇప్పుడు మీరు ఎటువంటి ప్రమాదం లేకుండా ముందుకు సాగవచ్చుని దీని అర్థం.