365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మార్చి12,2023: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆటలు పోటీలు నిర్వహించగా ఈ పోటీలలో ఎక్కువ బహుమతులు 60 ఏళ్ల వయసుపైబడిన బి.సరోజిని సాధించారు.
ఈ వయసులో కూడా ఇంత ఉత్సాహంగా ఉండడం చాలా గొప్పవిషయం అని,ఆమె అన్ని అవార్డులు పొందడం ద్వారా నేటి తరానికి స్పూర్తినిచ్చారని కౌన్సెలింగ్, సైకో థెరపీస్ట్, హిప్నో థెరపీస్ట్ డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు.
డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో డా.హిప్నో పద్మా కమలాకర్, గీత, జి.కృష్ణవేణి, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్, నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా హిప్నో థెరపీస్ట్ డా.హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ మహిళలకు ఆటలే ఆయుధమని అన్నారు. ఓటు హక్కు సాధించేందుకు ‘సఫ్రేజెట్టో’ అనే ఆటతో మహిళలు ఉద్యమం చేసి సాధించారని, తమకు ఆత్మవిశ్వాసం తక్కువని, ఎందులోనూ రాణించలేకపోతున్నామని చాలామంది మహిళలు భావిస్తుంటారన్నారు.
మహిళలు తమ సామర్థ్యాలకు పదును పెట్టుకున్నప్పుడు.. విలువలను, ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నప్పుడే నలుగురిలో తమ స్వరం వినిపిస్తుంది. నాయకత్వం దక్కుతుందని ఆమె తెలిపారు.
డా.హిప్నో పద్మాకమలాకర్ గారు రాసిన అద్భుతమైన పుస్తకాలూ కావాలంటే.. ఇక్కడ క్లిక్ చేయండి.. 👆
ప్రతికూల భావనలను తీసేసి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఆటలు బాగా ఉపయోగపడు తాయన్నారు. ఈ ఆటల్లో గెలుపొందినవారిలో పూర్ణ, శ్రీలత, స్వరూపారాణి, యశోద, జ్యోతి తదితరులున్నారు.
డా.హిప్నో పద్మాకమలాకర్
,కౌన్సెలింగ్, సైకో థెరపీస్ట్, హిప్నో థెరపీస్ట్
@9390044031.
డా.హిప్నో పద్మాకమలాకర్ గారు రాసిన అద్భుతమైన పుస్తకాలూ కావాలంటే.. ఇక్కడ క్లిక్ చేయండి.. 👆