Tue. Apr 30th, 2024
IPAC-utter-flop

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌,19 మార్చి 2023: దేశంలోని ఇప్పటిదాకా పలు పార్టీలు ఐప్యాక్ టీమ్ అందించిన వ్యూహాలతో విజయాలు సాధించాయని మార్మోగి పోతోంది. అయితే ఏపీలో అలాంటి వ్యూహాలు ఫలించలేదా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో విషయంలో ఐప్యాక్ అంచనాలు తల్లకిందులయ్యాయి. ఐప్యాక్ లెక్కలు అదుపు తప్పి వైసీపీని ఓడించాయి.

గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మూడింట్లోనూ టీడీపీ విజయం సాధించింది. ఈ ఊహించని రిజల్ట్ ను చూసి అధికార పార్టీ వైసీపీ అవాక్కయింది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే లెక్క తప్పిందని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అంచనా ఎక్కడ తప్పిందో వైసీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు.

IPAC-utter-flop

వైసీపీకి గత ఎన్నికల నుంచి ఐప్యాక్ టీం వ్యహకర్తగా పనిచేస్తోంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐప్యాక్ వ్యూహాలు బెడిసికొట్టాయి. ఐప్యాక్ ఒక చోట టార్గెట్ చేస్తే దెబ్బ మరోచోట పడిందని చెబుతున్నారు. టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారని భావించారు, యువత తమవైపు ఉంటుందని ఊహల్లో తేలిపోయారు. కానీ ఫలితం మరోలా వచ్చింది. యువత వైసీపీపై పీకల్లోతు కోపంతో ఉన్నారని తేలింది. అసలు డ్యామేజ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దగ్గర జరిగింది.

అడ్డగోలుగా అనర్హులను ఓటర్లుగా నమోదు చేయించడం,డబ్బులిచ్చి ఓటర్లను కొనడం, పోలింగ్లో అవకతవకలు చేయడం ద్వారా ఈజీగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచవచ్చని ఐప్యాక్ సలహా ఇచ్చినట్లు సమాచారం.

కానీ పట్టభధ్రులు సైతం జగన్ పై తీవ్ర ఆగ్రహంలో ఉన్నారని, వారిని ఆకట్టుకునేందుకు ఏదోటి చేయాలన్న ఆలోచన ఐప్యాక్ టీం రాకపోవడం పెద్ద మైనస్.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచే స్పష్టమైన వ్యూహాన్ని అమలు చేయడంలో ఐప్యాక్ ఫ్లాపైంది .దానితో బొక్కా బోర్లా పడి, మూడు ఎమ్మెల్సీల్లో ఘోరపరాజయం మూటగట్టుకున్నారు. ఈ ఎఫెక్ట్ వచ్చే ఎన్నికలపై పడుతుందని టీడీపీ ఇకపై రెచ్చిపోతుందని ఐప్యాక్ వర్గాలే అంగీకరించడం కొసమెరుపు.

IPAC-utter-flop

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటమి తర్వాత ఐప్యాక్ టీమ్ తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమైనట్లుగా టాక్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాలు తప్పితే, వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తారని మండిపడ్డారట. ఇంత చిన్న ఎన్నికను కూడా మేనేజ్ చేయలేకపోతే మీ వ్యూహాలు ఎందుకని ఆయన నిలదీసినట్లు తెలుస్తోంది.

కోట్లకు కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నప్పుడు.. ఎందుకు పనిచేయలేకపోయారని జగన్ నిలదీస్తుంటే ఐప్యాక్ టీం దగ్గర సమాధానం లేకపోయిందట. వచ్చే ఎన్నికల్లో తాను టార్గెట్ 175 ఫిక్స్ చేసుకున్నానని.. ఇలాగైతే వేరే దారి చూసుకోవాల్సి వస్తుందని ఐప్యాక్ ను చెడామడా వాయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం .