365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మార్చి 31,2023: అఖిల భారత కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు సంఘం నూతన భవన నిర్మాణానికి శంఖు స్థాపన శుక్రవారం జరిగింది. హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్న కాపుభవన్ సముదాయంలో పూజా నూతన భవన నిర్మాణానికి శంఖుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.
శుక్రవారం అఖిల భారత కాపు తెలగ బలిజ వంటరి మున్నూరు కాపు సంఘం నూతన భవనం శంఖు స్థాపన పూజా కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గౌరవనీయులైన యర్రపోతు ప్రభాకర రావు, ఉపాధ్యక్షులు గౌరవనీయులైన అరవ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో కాపుబంధువులు, సంఘం కార్యవర్గసభ్యులు ఎల్ బి నగర్ నియోజకవర్గం సభ్యులు వెంకట సాయి ప్రసాద్ కోటిపల్లి తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మానం కోసం అహర్నిశలు కృషి చేసిన సంఘ కార్యవర్గ సభ్యులకు ఎ. వి. రత్నం, అరవా రామకృష్ణ, వై. ప్రభాకరరావు, తోట హనుమంతరావులకు, విరాళాలు అందించిన దాతలకు శుభాభినందనలు తెలిపారు. కమిటీ నిర్థేశించుకున్న ప్రకారం సంవత్సర కాలంలో నిర్మాణం పూర్తయి కాపుజాతికి సేవలు అందించాలని కోరుకుందాం..! ఘనంగా జరిగిన భవన నిర్మాణ “శంకుస్థాపన” కార్యక్రమంలో దాదాపు వెయ్యి మందికిపైగా కాపుబంధువులు పాల్గొన్నారు.