Mon. Dec 16th, 2024
Dr.-Hypnokamalakar

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, ఏప్రిల్ 9,2023: డా.హిప్నో పద్మాకమలాకర్, పి.స్వరూపా రాణి, ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు, సైకాలజీ లెజెండ్ డా.హిప్నో కమలాకర్ 57వజయంతి, 2వర్ధంతి ఉత్సవాలు ఈ నెల 10వ తేదీ నుంచి వారం రోజులపాటు 16వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరుగుతాయని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డా.హిప్నో పద్మాకమలాకర్, డా.క్యార్లిన్, పి.స్వరూపా రాణి, తెలిపారు.

సామాజిక సమానత్వం కోసం, చైతన్యం తెచ్చేలా ప్రోగ్రామ్స్ చేసిన ” ఫైటర్”, 100 పుస్తకాలు రాసిన “రైటర్”, సైకాలజీ రంగానికి ఊపిరి పోసిన మహోన్నత వ్యక్తి, 12 డిగ్రీలు చదివిన విద్యావంతుడు, మనస్తత్వ, వ్యక్తిత్వ వికాస నిపుణులు కమలాకర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ఆయన అభిమానులు, శిష్యులు పెద్దఎత్తున నిర్వహిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో సైకాలజిస్టులు డా. క్వార్లిన్, స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.

  ఆహ్వానం
10-4-2023వ తేదీన

హైదరాబాద్ బేగంపేట ఎస్.ఆర్.డి.రెయిన్ బో హోమ్ లో 12 గంటలకు కీ. శే.డా.హిప్నో కమలాకర్ గారి 57వ జయంతి 2 వ వర్ధంతి ఉత్సవం ఏర్పాటు చేసాము. సకాలంలో విచ్చేసి కార్యక్రమం ను విజయవంతం చేయగలరని ఆహ్వానిస్తున్నాము.

డా హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్, హిప్నో థెరపీస్ట్
@ 9390044031

error: Content is protected !!