Fri. Nov 22nd, 2024
Yashoda_penubala_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 18, 2023: ఇటీవల కాలంలో సంతాన లేమి దంపతుల్లో ఎక్కువ శాతం ట్యూబల్ బ్లాక్ (గర్భావాహి కలు మూసుకుని పోవడం) వంటి కేసులు నమోదు అవుతున్నాయి. అంతే కాకుండా గర్భధారణ కేసుల్లో కూడా ఇవి ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

అయితే ఈ సమస్యపై ప్రసూతి,స్త్రీల ఆయుర్వేద వైద్య నిపుణులు డా.యశోద పెనుబాల వివరంగా చెప్పారు.

“సాధారంగా గర్భధారణలో గర్భావాహికలు(ఫెల్లోపియన్ ట్యూబ్స్) పాత్ర చాలా ముఖ్యమైనది.. అండాశయం నుంచి విడుదల అయిన అండం ట్యూబ్ ద్వారానే ప్రయాణిస్తుంది.. అంతే కాకుండా అండం శుక్రకణంతో కలిసి ఫలదీకరణ చెందేది కూడా ట్యూబ్స్ లొనే..సంయోగం చెందిన అండం,శుక్రకణం మూడు రోజుల తర్వాతనే గర్భాశయాన్ని చేరి పిండంగా ఎదుగుతుంది..ఇదంతా సవ్యంగా జరగాలంటే ట్యూబ్స్ చాలా ఆరోగ్యంగా ఉండాలి.

సాధారణంగా ట్యూబల్ బ్లాక్స్ కారణంగా మూసుకుని పోయి ఉన్న ట్యూబ్స్ ని తిరిగి ఓపెన్ చేసినప్పటికీ వెంటనే అవి తిరిగి గర్బధారణ కలిగించే శక్తిని కలిగి ఉండవు..ట్యూబ్స్ లో సీలియా(వెంట్రుక వంటి ప్రమాణాలు)ఉంటాయి.. వాటి కదలికల వల్లనే అండంట్యూబ్స్ నుంచి గర్భాశయం వైపుగా నెట్టబడుతూ ఉంటుంది.

ట్యూబ్స్ బ్లాక్ వల్ల ఇవి నశించే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని సార్లు ట్యూబ్స్ ఓపెన్ అయినప్పటికీ ప్రెగ్నెన్సీ రావడానికి ఇంకొన్ని నెలలు సమయం పడుతుంది. డాక్టర్స్ చెప్పినప్పటికీ తొందరపడి ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ట్యూబ్లొనే ప్రెగ్నెన్సీ ఏర్పడుతుంది. ఎదగడం మొదలైన కొన్ని రోజుల తర్వాత అబార్షన్ అవుతుంది.

కొన్ని సందర్భాలలో ట్యూబ్ చిట్లి పోయే అవకాశం ఉంటుంది..దానివల్ల కొన్ని సార్లు చాలా రిస్క్ కూడా ఉంటుంది.-డా.యశోద పెనుబాల..ప్రసూతి,స్త్రీల వైద్య నిపుణులు(ఆయుర్వేదం).

error: Content is protected !!