medical-train_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,ఏప్రిల్ 19,2023: భారతీయ రైల్వేలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల సౌకర్యార్థం మధ్యప్రదేశ్‌లోని రేవా నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ల మధ్య రైలును నడపనున్నారు. ఈ ట్రైన్ పేరు “రివా ఇత్వారీ”. ఈ రైలు వారానికి నాలుగు రోజులు నడుస్తుంది.

ఇంతకు ముందు వారానికి మూడు రోజులు రైలు నడుస్తున్నప్పటికీ, ఈ ఇప్పటి నుంచి ఇక్కడి ప్రజలకు ఏడు రోజులూ నాగ్‌పూర్‌కు రైలు అందుబాటులోకి రానుంది. సాధారణ ప్రజలు కూడా ఈ రైలులో ప్రయాణించవచ్చు, అనారోగ్యంతో ఉన్నవారికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం దీని ఉద్దేశం.

medical-train_365

రేవా దాని చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు చికిత్స కోసం నాగ్‌పూర్‌కు వెళ్ళుతుంటారు. రైలులో సీట్లు లేకపోవడంతో ప్రజలు బస్సులు లేదా ప్రయివేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.

దీనికి ఎక్కువ సమయం డబ్బు వృధా అవుతుంది. ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్నవారు కూడా ప్రయాణంలో అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ ఈ కొత్త రైలును నడపబోతోంది. ఏప్రిల్ 24న ఈ రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

వ్యాధిగ్రస్తులు చికిత్స కోసం వెళ్లేందుకు ఈ రైలు ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. ఈ రైలు రేవా, సత్నా కట్ని, జబల్‌పూర్ మీదుగా నాగ్‌పూర్ చేరుకుంటుంది.

medical-train_365

రేవా నుంచి సత్నా మధ్య దూరం దాదాపు 780 కి.మీ. దీని షెడ్యూల్ త్వరలో విడుదల చేయనుంది రైల్వే మంత్రిత్వ శాఖ. ముఖ్యంగా వ్యాధిగ్రస్తులు భవిష్యత్ ప్రయాణాలకు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కలిపిస్తుంది.