365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 13,2023:SSCE (2022-23) బోర్డ్ ఎగ్జామ్స్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన 12వ తరగతి విద్యార్థులను, ఉపాధ్యాయులను నాచారం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అభినందిస్తోంది. అలాగే ఇంత గొప్ప విజయం సాధించినందుకు గర్వంగా ఉందంటోంది. కామర్స్..
సంక భావన – 98.4%
సైన్స్..
ఆంతారా అగర్వాల్ – 97.2%
హ్యుమానిటీస్..
ఆర్యన్ కుమార్ సాహు – 96.4%
పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య, డైరెక్టర్ పల్లవి, సీఓఓ యశస్వి, సీనియర్ ప్రిన్సిపాల్ ఎస్. సునీతా రావు, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్,నందితా సుంకర, ఉపాధ్యాయుల దూరదృష్టే ఈ సంవత్సరం అత్యద్భుతమైన ఫలితాలు వచ్చేందుకు తోడ్పడింది.
-19 మంది విద్యార్థులు 95% ,అంతకంటే ఎక్కువ
– 87 మంది విద్యార్థులు 90% ఆపైన మార్కులు
-246 మంది విద్యార్థులు 80% ఆపైన మార్కులు
– 398 మంది 70% ఆపైన మార్కులు
-470 మంది విద్యార్థులు (100%) 60%,అంతకంటే ఎక్కువ
-20 మంది విద్యార్థులు సెంటమ్‌లు సాధించారు.
ఫ్యాషన్ స్టడీస్, కెమిస్ట్రీ, పొలిటికల్ సైన్స్, బయాలజీ, సైకాలజీ, బిజినెస్ స్టడీస్, లీగల్ స్టడీస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పెయింటింగ్ సబ్జెక్టులలో జాతీయ ర్యాంకులు సాధించారు విద్యార్థులు. మిగిలిన ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, అకౌంటెన్సీ, హిస్టరీ, జాగ్రఫీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫిజిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఎన్సీసీలో 99 మంది అత్యధిక మార్కులు సాధించారు.
ఈ సంవత్సరం విద్యార్థులు ఎఫ్ఎంఎం, మాస్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యోగా,ఇసిసిఇ మొదలైన కొత్త ఐదు సబ్జెక్టులైన ఒకేషనల్ స్కిల్స్ పరీక్షకు ఈ సంవత్సరం విద్యార్థులు హాజరయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 2 సెంటమ్‌లు ,మిగిలిన సబ్జెక్ట్‌లలో అత్యధికంగా 98తో అద్భుతమైన పనితీరు కనబరిచారు.