365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మే19, 2023: మే 24 వ తేదీ బుధవారం కొవ్వూరులో “జగనన్న విద్యా దీవెన” రాష్ట్ర స్థాయి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని హోం మంత్రి డా తానేటి వనిత పేర్కొన్నారు.

సోమవారం స్థానిక కొవ్వూరు లో సిఎం పర్యటన పై ముందస్తు ఏర్పాట్లు నేపథ్యంలో హోం మంత్రి ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మే 24 బుధవారం కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటనను పెద్ద ఎత్తున విజయవంతం చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

ఈ పర్యటన నేపథ్యంలో కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రదేశాలను పరిలించడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జిల్లా కలెక్టర్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగిందన్నారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో క్షేత్ర స్థాయి లో జిల్లా యంత్రాంగం తీసుకోవలసిన చర్యలపై సూచనలు జారీ చేశామని ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త , ఎమ్ ఎల్ సి తలశిల రఘురాం తెలిపారు.

కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సీయం పర్యటన ఏర్పాట్లకు సంబందించి అధికారులకు పలు సూచనలు చేసారు. జగనన్న విద్యా దీవెన రాష్ట్ర స్థాయి కార్యక్రమం కొవ్వూరు పట్టణంలో నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాడంపై అధికారులు పూర్తి సన్నద్ధం చేస్తున్నట్లు మాధవీలత పేర్కొన్నారు.

ఎటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలన్నారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపద్యంలో బందోబస్తు వాహనాల మల్లింపు, పార్కింగ్ ఇత్యాది అంశాలపై వివరాలను జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి తెలియజేశారు.

అనంతరం ఆర్డీవో కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఆర్ ఎం సి మునిసిపల్ కె. తేజ్ భరత్, ఆర్డీవో ఎస్. మల్లి బాబు, ఇతర జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు ఆర్డీవో కార్యాలయంలో సమావేశం అయ్యారు.