Tue. Dec 24th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మే 28,2023: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విక్రమ్ కొత్త నిర్మాణ సంస్థ వీ మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి పనిచేస్తాయని ప్రకటించారు. తమ మొదటి ప్రాజెక్ట్ వివరాలు ఈరోజు తెలియజేస్తామని వెల్లడించారు. ఇప్పుడు మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంది.

పోస్టర్‌లో, ఐకానిక్ లండన్ బ్రిడ్జ్ దగ్గర ఒక వ్యక్తి చేయి పడవలో ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రొడక్షన్ హౌస్ “హీరో ఈ కథను నడిపిస్తూ చరిత్ర గతిని మార్చాడు” అనే క్యాప్షన్‌తో ముందుకు వచ్చింది. అలాగే, హీరో ఎవరో గెస్ చేయమని మేకర్స్ ప్రేక్షకులను కోరారు.

ఇందులో అఖిల్ లేదా నిఖిల్ కథానాయకుడిగా నటిస్తారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇవాళ ఉదయం 11:11 గంటలకు హీరో, దర్శకుల వివరాలు తెలుస్తాయి. “రివల్యూషన్ ఈజ్ బ్రూయింగ్” అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్.

error: Content is protected !!