Fri. Nov 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జూన్ 14,2023: నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎప్పుడూ విజ్ఞానం, ఉత్సాహంతో నిండి ఉంటుంది. 2023, జూన్ 14న సీబీఎస్సీ నేతృత్వంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరాసీ (FLN)పై రాష్ట్ర స్థాయి సమావేశం ఈ స్కూల్లో ఘనంగా జరిగింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా G-20 ప్రెసిడెన్సీ తప్పనిసరి అయింది.

ఈ ప్రత్యేక ఈవెంట్ కోసం 50 మంది ప్రధానోపాధ్యాయులు 234 మంది ఉపాధ్యాయులు నమోదు చేసుకున్నారు. తర్వాత ప్రార్థన, నృత్యం యోగా సెషన్‌తో అతిథులను ఆహ్వానించారు. చైర్మన్ మల్కా కొమరయ్య అతిథులను ఉద్దేశించి ప్రసంగించారు. స్కూల్ సేవోవో మల్కా యశస్వి తన అసాధారణ నైపుణ్యంతో సహాయాన్ని అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

స్కూల్ సీనియర్ ప్రిన్సిపల్ సునీతరావు అతిథులను సత్కరించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ బసుత్కర్ జగదీశ్వర్ రావు ప్రసంగించారు. భారతదేశ లావాదేవీలు డిజిటలైజ్ అయ్యాయని, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం నిలవబోతోందని ఆయన అన్నారు.

ప్రొఫెసర్ సుమితా రాయ్ (రిటైర్డ్) ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ హెడ్ డైరెక్టర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ శిక్షణా కేంద్రం ప్రొఫెసర్ సుమితా రాయ్ (రిటైర్డ్).. ఆటలు,ఇతర కార్యకలాపాలపైన చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంత తవుతం స్కూళ్లలో సృజనాత్మకత గురించి ప్రసంగించారు.

దిశా దోషి (ఇన్నోవేషన్ అనలిస్ట్), సీతా కిరణ్ (డీఏ వీ స్కూల్స్ రిటైర్డ్ రీజనల్ డైరెక్టర్), డా. స్కంద్ బాలి, ప్రముఖ విద్యావేత్త, శరత్ చంద్ర కొండేల (బటర్ ఫ్లై ఎడ్యుఫీల్డ్స్ ఎండీ, సీఈఓ).. తమ అమూల్యమైన అంతర్దృష్టులను ప్యానెల్ డిస్కషన్స్ లో పంచుకున్నారు.

సీతా కిరణ్ మరియు శరత్ చంద్ర.. ఈ సందర్భంగా గ్రామీణ పాఠశాలలతో తమ వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకున్నారు. SAPA వ్యవస్థాపకులు అంబి సుబ్రహ్మణ్యం బిందు సుబ్రహ్మణ్యం.. SAPA పాఠ్యప్రణాళిక సంగీతంతో విభిన్న విషయాలను తెలుసుకోవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమం జరుగుతున్న నాచారం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వివిధ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. FLN అంబాసిడర్‌లుగా సీనియర్ సెకండరీ పాఠశాల విద్యార్థులు ఎంతో కష్టపడ్డారు. అలాగే ఈ కార్యక్రమంలో FLN స్టేషన్ల ఏర్పాటు, ప్రాథమిక స్థాయిలో FLN రీడింగ్ ఫెస్టివల్ నిర్వహించారు. G20 థీమ్‌పై కూడా పోటీ నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి సునీతా రావు వ్యాఖ్యలతో కార్యక్రమం ముగిసింది.

error: Content is protected !!