Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 24,2023: భారత దేశంలోని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ప్రకారం, మార్చి త్రైమాసికంలో గోల్డ్ ఇటిఎఫ్‌ల నుంచి రూ. 1,243 కోట్లు, డిసెంబర్ త్రైమాసికంలో రూ. 320 కోట్లు, సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 165 కోట్లు ఉపసంహరించాయి.

జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో ఈటీఎఫ్‌లో 1,438 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గోల్డ్ ఇటిఎఫ్ ఫోలియోల సంఖ్య 1.5 లక్షలు పెరిగి 47.52 లక్షలకు చేరుకుంది.

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో రూ.298 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు వరుసగా మూడు త్రైమాసికాల్లో ఉపసంహరణలు జరిగాయి. అయితే, ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 80 శాతం పెట్టుబడులు తగ్గాయి.

విదేశీ ఇన్వెస్టర్లు 43,800 కోట్ల పెట్టుబడులు పెట్టారు.విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు భారత స్టాక్ మార్కెట్‌లో రూ.43,800 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీంతో ఈ ఏడాది మొత్తం పెట్టుబడి రూ.1.20 లక్షల కోట్లు దాటింది.

error: Content is protected !!