365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 3,2023: ఇటీవల ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్‌లో భావిక్ ఫోటోగ్రఫీకి చెందిన డిజిటల్ ఫోటోగ్రాఫర్ భావిక్ మోనాని 2023 సంవత్సరానికి ఉత్తమ అంతర్జాతీయ ఐకానిక్ ఫోటోగ్రాఫర్ అవార్డును గెలుచుకున్నారు. దీనిని రూపాలీ గంగూలీ (నటి అనుపమ) చేతులమీదుగా అందించారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ నటీనటులు, గాయకులు, విజువల్ ఆర్టిస్ట్‌లు, డిజిటల్ ఆర్టిస్ట్‌లు, శిల్పులు, క్యూరేటర్లు, మోడరన్ ఆర్ట్ పెయింటర్లు, మ్యూజిషియన్‌లు, డిస్క్ జాకీలు (DJs), రేడియో జాకీలు (RJs), కరోకే జాకీలు (KJs) ఇంకా చాలా మంది హాజరవుతున్నారు.

భావిక్ గతంలో అనేక అవార్డులను గెలుచుకున్నారు. ఆయన సోషల్ మీడియా టైమ్‌లైన్ ఫోటోగ్రాఫ్‌ల కలెక్షన్ కలిగి ఉన్నారు. ఈ సందర్భంగా భావిక్ మోనాని మాట్లాడుతూ.. ఈ అవార్డును గెలుచుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు తనకు ఎంతో ప్రత్యేకమైనదని, ఈ అవార్డు ఫొటోగ్రఫీ రంగంలో మరిన్ని విజయాలు సాధించడానికి తన కెరీర్‌లో అవసరమైన బూస్ట్ ఇస్తుందని అన్నారు.