Fri. Nov 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 17,2023: ఈ-వేస్ట్ రీసైక్లింగ్ కు సెలెక్ట్ మొబైల్స్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. సెలెక్ట్ మొబైల్స్ అవుట్ లెట్లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ-వేస్ట్ బిన్స్ ఏర్పాటుచేసింది.

ఈ-వేస్ట్ కు కూపన్లు.. పనికిరాని ఎలక్ట్రానిక్‌ వస్తువులను సెలెక్ట్‌ రిటైల్‌ స్టోర్లకు తీసుకు వస్తే… కస్టమర్లు రూ.1,000 నుంచి రూ.10,000 వరకు డిస్కౌంట్‌ కూపన్‌ ఇస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కూపన్‌ కాల పరిమితి ఆరు నెలల వరకు ఉంటుంది. https://celekt.com/

మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్‌ పీసీలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను డిపాజిట్‌ చేయడం ద్వారా వినియోగదారులు డిస్కౌంట్‌ కూపన్‌ పొందవచ్చు. ప్రతి సెలెక్ట్‌ ఔట్‌లెట్‌లో ప్రత్యేకంగా ఈ-వేస్ట్‌ బిన్స్‌ను ఏర్పాటు చేస్తారు.

అలాగే నివాస స్థలాలు, పాఠశాలలు, దేవాలయాలు, ఇతర కీలక ప్రాంతాల్లోనూ ఈ-వేస్ట్‌ కియోస్క్‌లను అందుబాటులో ఉంచాలన్నది ఈ కంపెనీ ప్రణాళిక. సెలెక్ట్‌ మొబైల్స్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో 150 అవుట్ లెట్స్ ఉన్నాయి.

మిషన్ ఈ-వెస్ట్: ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ నిర్వహణ, రీసైక్లింగ్‌లో దేశంలోనే తొలిసారిగా మిషన్‌ ఈ-వేస్ట్‌ పేరుతో వినూత్న కార్యక్రమానికి మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ సెలెక్ట్‌ మొబైల్స్‌ శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, సెలెక్ట్‌ మొబైల్స్‌ సీఎండీ వై.గురు చేతుల మీదుగా మిషన్‌ ఈ-వేస్ట్‌ను ఆవిష్కరించారు. https://celekt.com/

ఆరోగ్యం, పర్యావరణంపై ఈ-వేస్ట్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు సెలెక్ట్‌ మొబైల్స్‌ ఒక అడుగు ముందుకేసిందని నిర్వాహకులు తెలిపారు. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఎలక్ట్రానిక్స్‌ వినియోగంతో పర్యావరణం, ఆరోగ్యంపై ఈ-వేస్ట్‌ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది.

సరైన రీతిలో నిర్వహించని ఈ-వేస్ట్‌ గాలి, నీరు, మట్టిని కలుషితం చేస్తున్నాయి. ఇది చర్మ వ్యాధుల నుంచి డీఎన్‌ఏ ఉత్పరివర్తనాల వరకు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఇందుకు పరిష్కారంగా మిషన్‌ ఈ-వేస్ట్‌కు సెలెక్ట్‌ మొబైల్స్‌ శ్రీకారం చుట్టింది. https://celekt.com/

పరిశుభ్ర వాతావరణాన్ని, జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో సేకరించిన ఈ-వేస్ట్‌ను నిబంధనలకు అనుగుణంగా రీసైక్లింగ్‌ చేస్తు్న్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ-వేస్ట్‌ నిర్వహణ కేవలం పర్యావరణ హితం కోసమే కాదు, ప్రతి భారతీయ పౌరునికి అత్యవసరం అని సెలెక్ట్‌ మొబైల్స్‌ తెలిపింది.

మనవాళికి అతి పెద్ద సవాల్: మంత్రి కేటీఆర్..

ఉపయోగించని లేదా సరిగా పని చేయని ఎలక్ట్రానిక్‌ పరికరాలను సరైన రీతిలో నిర్వహించకుండా వాటిని ఇళ్లలోనే అట్టిపెట్టుకుంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ-వేస్ట్ పారవేయడం వల్ల ఉత్పన్నమయ్యే ఆరోగ్య ప్రమాదాలను ఆయన గుర్తు చేశారు.

మిషన్ ఈ-వేస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సెలెక్ట్‌ మొబైల్స్‌ చొరవను ప్రశంసించారు. కంపెనీ అంకితభావాన్ని, పెరుగుతున్న ఈ-వేస్ట్‌ సంక్షోభాన్ని పరిష్కరించడంలో వారి ప్రయత్నాలపై హర్షం వ్యక్తం చేశారు.

ఐటీ కారిడార్లు, మాల్స్, బస్టాప్‌లు, విమానాశ్రయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు వంటి ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండే కీలక ప్రదేశాల్లో వ్యూహాత్మకంగా ఈ-వేస్ట్‌ డబ్బాలను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ఆయన కోరారు.

వ్యర్థాల నిర్వహణ పెద్ద సవాల్‌గా మారిందని గుర్తు చేశారు. మానవాళికి అతిపెద్ద సవాల్‌గా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రీయంగా ఈ-వేస్ట్‌ను నిర్వహిస్తేనే మనుగడ ఉంటుందని అన్నారు. దేశంలో ఏటా 20 లక్షల టన్నుల ఈ-వేస్ట్‌ పోగవుతోందని మంత్రి వెల్లడించారు.

పెరుగుతున్న ఈ-వేస్ట్..

భారత్‌లో ఈ-వేస్ట్ ఉత్పత్తిలో ఏటా 20-25 శాతం పెరుగుదల ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2020లో 10.45 లక్షల మెట్రిక్ టన్నులు ఈ-వేస్ట్‌ నమోదైంది. ఈ ఏడాది 18.3 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. 2025 నాటికి 25.4 లక్షల మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని అంచనా.

సమస్య తీవ్రత ముఖ్యంగా ముంబయి, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఎక్కువగా ఉంది. ఆశ్చర్యకర విషయం ఏమంటే దాదాపు 95 శాతం ఈ-వేస్ట్‌ మురికివాడలలో పేరుకుపోతున్నాయి. ఫలితంగా భయంకరమైన పర్యావరణ, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. https://celekt.com/

పనికిరాని మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలు, మౌస్, కీబోర్డ్‌ల వంటి పెరిఫెరల్స్‌తో సహా అనేక రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను ఈ-వేస్ట్‌గా పరిగణిస్తారు.

ఈ పరికరాలను ఎక్కడపడితే అక్కడ పారవేయడం పర్యావరణ విపత్తు, మానవ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. వీటితో నేల, నీరు, గాలి కలుషితం అవుతోంది. పీల్చే కాలుష్యాల వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి.

ఈ-వేస్ట్‌లో కనిపించే భారీ లోహాలు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. ఈ-వేస్ట్‌లోని టాక్సిన్స్ గుండె సమస్యలకు కారణం అవుతున్నాయి.

కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యాలు, అవయవాలు దెబ్బతినడం, క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది. హార్మోన్లపై ప్రభావంతో పునరుత్పత్తి, అభివృద్ధి ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుంది. https://celekt.com/

error: Content is protected !!