Fri. Nov 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 14,2023: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఒడుదొడుకులకు గురైన సూచీలు చివరికి గరిష్ఠాల్లోనే ముగిశాయి.

ఆసియా మార్కెట్లు ఔట్‌ పెర్ఫామ్‌ చేయడంతో ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసం నింపింది. ఇన్ఫోసిస్‌, ఎం అండ్‌ ఎం నుంచి మద్దతు లభించడంతో నిఫ్టీ 20,000 పైనే కొనసాగుతోంది.

మెటల్‌, పీఎస్‌యూ బ్యాంకు రంగాల షేర్లు మార్కెట్‌కు దన్నుగా నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 33, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 52 పాయింట్లు పెరిగాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలహీనపడి 83.04 వద్ద స్థిరపడింది. జపాన్‌, కొరియా, చైనా సూచీలు ఎగిశాయి.

క్రితం సెషన్లో 67,466 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 67,627 వద్ద మొదలైంది. 67,336 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,771 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.

చివరికి 52 పాయింట్ల లాభంతో 67,519 వద్ద ముగిసింది. 20,125 వద్ద ఓపెనైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20,043 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయింది.

20,167 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొని 33 పాయింట్ల లాభంతో 20,103 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్‌ 91 పాయింట్ల లాభంతో 46,000 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 50లో 28 కంపెనీలు లాభపడగా 21 నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో (3.30%), యూపీఎల్‌ (3.86%), ఎంఅండ్‌ఎం (2.41%), ఓఎన్‌జీసీ (2.15%), దివిస్‌ ల్యాబ్‌ (2.00%) టాప్‌ గెయినర్స్‌.

ఏసియన్‌ పెయింట్స్‌ (1.15%), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ (0.97%), కోల్‌ ఇండియా (0.86%), బ్రిటానియా (0.74%), ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (0.71%) టాప్ లాసర్స్‌.

ఎఫ్‌ఎంసీజీ, మీడియా, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ రంగాలు ఒడుదొడుకులకు లోనైనా ఆటో, మెటల్‌, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాలు పెరిగాయి.

నిఫ్టీ సెప్టెంబర్‌ ఛార్ట్‌ను పరిశీలిస్తే 20,200 వద్ద రెసిస్టెన్స్‌, 20080 వద్ద సపోర్ట్‌ ఉన్నాయి. బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, సువెన్‌ ఫార్మా, బర్జర్‌ పెయింట్స్‌, ఎంఆర్‌ఎఫ్‌, సనోఫీ ఇండియా, యూపీఎల్‌ షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేయొచ్చు.

నేడు మార్కెట్లను రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌ నడిపించాయి. మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 471 పాయింట్లు పెరిగింది. బ్రోకరేజెస్‌ అప్‌గ్రేడ్‌ రేటింగ్‌ ఇవ్వడంతో యూపీఎల్‌ షేర్లు నాలుగు శాతం పెరిగాయి. ఇన్వెస్టర్లు మెటల్‌ స్టాక్స్‌ కోసం ఎగబడ్డారు.

క్రూడాయిల్‌ ధరల పెరగడంతో ఓఎన్‌జీసీ షేర్లు రెండు శాతానికి పైగా ఎగిసి 52 వారాల గరిష్ఠానికి చేరుకున్నాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లాభాలను నిలబెట్టుకోలేకపోయింది. ఖనిజాల ధరలను పెంచడంతో ఎన్‌ఎండీసీ షేరు ఐదు శాతం పెరిగింది.

షుగర్‌ స్టాక్స్‌ తీపిని పంచుతున్నాయి. ఎక్కువ వాల్యూమ్‌తో ట్రేడవుతున్నాయి. మార్కెట్‌ విలువ పెంచడంతో కాన్‌కర్‌ షేర్లు ఎగిశాయి.

బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్‌ విలువ గురువారం రెండు లక్షల కోట్ల మేర పెరిగింది. ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకులో 18.5 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇండస్‌ టవర్‌లో 20.6 లక్షల షేర్లు చేతులు మారాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709.
error: Content is protected !!