365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 19,2023: విజయ్ ఆంటోని కుమార్తె మీరా మంగళవారం ఉదయం చెన్నైలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయస్సు 16 సంవత్సరాలు.
ప్రముఖ తమిళ నటుడు, సంగీత విద్వాంసుడు విజయ్ ఆంటోని కుమార్తె మీరా కన్నుమూశారు. మీరా మంగళవారం ఉదయం చెన్నైలో ఆత్మహత్య చేసుకుంది.
ఆమె వయస్సు 16 సంవత్సరాలు. ఆమె తెల్లవారుజామున 3 గంటలకు చెన్నైలోని తమ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడగా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఆమె ఇటీవల తీవ్ర ఒత్తిడికి గురైంది.. దీనికారణంగా చికిత్స పొందుతోంది.
ఈ హృదయ విదారక సంఘటనపై విజయ్ ఆంటోనీ అతని కుటుంబం ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
మీరా మృతదేహం మంగళవారం ఉదయం చెన్నైలోని తేనాంపేట్ ప్రాంతంలోని ఆమె ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. మీరా నగరంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 12వతరగతి చదువుకుంటుంది. ఆమె డిప్రెషన్‌తో బాధపడుతోంది.
అయితే ఇప్పుడు మీరా మృతి విషయంలో ఆమె ఒత్తిడికి గురయ్యారనే విషయం మాత్రం నిర్ధారణ కాలేదు. ఆమె మృతిపై పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
విజయ్‌కి ఇద్దరు కుమార్తెలు..
విజయ్ , ఫాతిమా విజయ్ ఆంటోనీలకు మీరా పెద్ద కుమార్తె. వీరికి లారా అనే చిన్న కుమార్తె కూడా ఉంది. ఫాతిమా అనే సోషల్ మీడియా ఖాతాలో విజయ్, ఫాతిమా ,కుమార్తెలు కలిసి ఉన్న చిత్రం ఉంది.
ఈ ఫోటో మే 2022లో పోస్ట్ చేశారు. విజయ్ ఆంటోని తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడే కాక, నటుడుగా కూడా పరిచయమే.
తమిళ చిత్రాలకు ప్రముఖ హిట్ పాటలను అందించిన తర్వాత విజయ్ నటుడిగా మారాడు. దర్శకత్వ నైపుణ్యంతో పాటు నిర్మాతగా కూడా పలు సినిమాలు చేశారు. ఆయన భార్య ఫాతిమా విజయ్ ఆంటోని అతని ప్రొడక్షన్ హౌస్‌ని నిర్వహిస్తోంది.