Wed. Oct 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 24,2023: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు ఆదివారం ఉదయం 8 గంట‌ల‌కు శ్రీమలయప్పస్వామివారు సూర్య‌ మండ‌ల మ‌ధ్య‌స్తుడై హిర‌ణ్మ‌య స్వ‌రూపుడిగా రామకృష్ణ గోవింద అలంకారంలో భ‌క్తుల‌ను క‌టాక్షించారు. శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు శంఖు చ‌క్రాలు, క‌త్తి, విల్లు, బాణం, వ‌ర‌ద హ‌స్తంతో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు.

ఆయురారోగ్య‌ప్రాప్తి..

సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు.

ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే.

అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నారు. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

error: Content is protected !!