Road-accident

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నల్గొండ,అక్టోబర్ 28,2023: నార్కట్‌పల్లి మండలం లింగోటం వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న లారీని టీఎస్‌ఆర్‌టీసీ బస్సు ఢీకొనడంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు.

బీహెచ్‌ఈఎల్‌ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌కు వెళ్తుండగా జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

Road-accident

గాయపడిన ఎనిమిది మంది ప్రయాణికుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామినేని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు.