Fri. Jan 3rd, 2025
Road-accident

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 6,2023: విజయవాడలో ని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద సోమవారం 12వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌ పైకి ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు ఢీకొనడంతో బస్సు కండక్టర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.

బస్సు కండక్టర్‌ను గుంటూరు-2 డిపోకు చెందిన వీరయ్యగా గుర్తించారు.

బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ఈ ఘటన జరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Road-accident

బాధితుల్లో బస్‌ కండక్టర్‌, ఓ మహిళ, బాలుడు ఉన్నారు. గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

ఎపిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ.. ఘటనపై విచారణ ప్రారంభించామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ ఘటనలో మృతుల కుటుంబీకులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారి కోసం ఆసుపత్రి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.

error: Content is protected !!