Mon. Dec 30th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 8,2023: భౌగోళిక గుర్తింపు కలిగిన దేశీయ హస్తకళా ఉత్పత్తులు,చేనేత వస్త్రాలు, వ్యవసాయోత్పత్తులతో కూడిన రిలయన్స్ రిటైల్ ‘స్వదేశ్‌’ స్టోర్‌ హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభం కానున్నది.

హ్యాండీక్రాఫ్ట్స్‌, ఆర్ట్‌ ఆబ్జక్ట్స్‌, ఫర్నీచర్‌, మాస్క్‌లు, టాయ్స్‌, పప్పట్స్‌, జ్యువలరీ, డైనింగ్‌, కిచెన్‌కు హోంవేర్‌, పెయింటింగ్స్‌, అప్పారల్‌, షాల్స్‌, ఫ్యాబ్రిక్స్‌, శారీస్‌, హోంలినెన్‌, వెల్‌నెస్‌ ఉత్పత్తులు తదితరాలు ఈ స్టోర్ లో లభిస్తాయి.

జూబ్లీహిల్స్‌, రోడ్‌ నం.36, అల్కజార్‌ మాల్‌లో ఏర్పాటైన స్వదేశ్‌ స్టోర్‌ ను రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్ పర్సన్ నీతా అంబానీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తొలి స్వదేశ్ స్టోర్ కావడం విశేషం.

error: Content is protected !!