365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 10,2023: రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం, గండిపేట పల్లవి ఇంటర్ నేషనల్ పాఠశాలలో డిసెంబర్ 9వ తేదీ” Annual Day (పాఠశాల వార్షికోత్సవం) “వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది. మా పల్లవి పాఠశాల సాధించిన విజయాలు పాఠశాలలో ఉన్న సౌకర్యాలు స్పోర్ట్స్, చక్కటి వాతావరణం, విశాలమైన తరగతి గదులు, డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రధానోపాధ్యాయురాలు వివరించారు.

ఇందులో నర్సరీ నుండి 2వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ నృత్యాలు, స్కిట్స్ ఎంతో ఆకట్టుకున్నాయి.

09-12- 2023 న, నర్సరీ నుంచి 2వ తరగతి విద్యార్థులతో పాఠశాల వార్షికోత్సవం ) నిర్వహించారు.దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్. నిదా ఫాతిమా హజారీ డాక్టర్.రాధ,మిస్టర్. జోహెర్ . విరూపాక్ష, పొలిమేర సినిమా హీరోయిన్ కామాకి భాస్కర్ల విచ్చేసి విద్యార్థుల ప్రదర్శనలను వీక్షించారు. వినోదాత్మక కార్యక్రమాలను నిర్వహించారు.

వ్యాఖ్యాతలుగా అనిష (2వ తరగతి) ఉపాధ్యాయురాలు అనుశ్రీ అతిథులైన పాఠశాల ప్రిన్సిపాల్ హేమ మాడభూషి, మీను (వైస్ ప్రిన్సిపాల్), మల్క కొమరయ్య(పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్), మల్క యసస్వి (పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ల CEO) రాకను ప్రకటించడంతో డిసెంబర్ 9వ, 2023న పాఠశాల వార్షికోత్సవం) వేడుక ప్రారంభమైంది.

అనంతరం సభకు పూల స్వాగతం పలకగా, పీఐఎస్ స్టూడెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మార్చ్ పాస్ట్ చేశారు.పల్లవి జెండాను ఎగురవేసి బెలూన్లను విడుదల చేయడం ద్వారా వేడుకను ప్రారంభించారు. గ్రేడ్ నర్సరీ2వ తరగతి విద్యార్థులతో నృత్యాలు, స్కిట్స్ ఎంతో చక్కగా ప్రదర్శించారు. పల్లవి పాఠశాల విద్యుత్తు కాంతులతో పాఠశాల ప్రాంగణం మిరమిట్లు గొలుపుతు. వీక్షించడానికి వచ్చిన తల్లిదండ్రులతో, విద్యార్థులతో పండుగ వాతావరణం కనిపించింది.