365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 10,2023: అదానీ టోటల్ గ్యాస్ 2030 నాటికి 75,000 ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీకి చెందిన మొత్తం 50 సైట్‌లు ఇప్పుడు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లను కూడా ఉపయోగిస్తున్నాయి.

ఈ మేరకు అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ శుక్రవారం ట్వీట్‌ చేశారు. తమ వాహనాలను డీజిల్‌ నుంచి సీఎన్‌జీకి మార్చినట్లు తెలిపారు. ఫ్లీట్‌లో చేర్చిన వాహనాలు ప్రతి సంవత్సరం 37 మిలియన్ (3.7 కోట్లు) కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.

కంపెనీ 2 లక్షలకు పైగా చెట్లను నాటింది. 28వ ఐక్యరాజ్యసమితి క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ నేపథ్యంలో, గ్రీన్‌స్పియర్ ఇనిషియేటివ్ కింద కంపెనీ 2.2 లక్షల చెట్లను నాటినట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్లాంటేషన్ ప్రతి సంవత్సరం వాతావరణం నుంచి 3,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

adani_group-365telugu

నవంబర్ 30 నుంచి డిసెంబర్ 23 వరకు దుబాయ్‌లోని ఎక్స్‌పో సిటీలో COP 28 సమ్మిట్ జరగనుంది. సంస్థ అన్ని సైట్‌లలో ఇప్పుడు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లను ఉపయోగిస్తున్నారని ట్వీట్‌లో చెప్పబడింది.

శుక్రవారం నాడు అదానీ టోటల్ గ్యాస్ షేరు 0.28% క్షీణతతో రూ.1,155.8/షేరు వద్ద ముగిసింది. దీనికి ముందు మూడు రోజుల పాటు ఈ షేర్లలో పెరుగుదల కనిపించింది.