365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 18,2023 : విడివిడిగా తింటే ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి. కానీ వీటిని కలిపి తింటే ఆరోగ్యం పాడవుతుందనే భయం ఉంటుంది.
ఐతే బ్యాడ్ కాంబినేషన్ ఫుడ్ విషయంలో ఎలాంటివాటిని కలిపి తినకూడదో….? ఇప్పుడు తెలుసుకుందాం..
అనారోగ్యకరమైన ఆహారాలు: శీతాకాలం లేదా వేసవి కాలంలో పెరుగును పలురకాల ఆహారంలో కలిపి తింటూ ఉంటారు. పెరుగు క్రమం తప్పకుండా తినే వారు అన్ని సీజన్లలో దీనిని ఎక్కువగా తింటారు.

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు జీర్ణక్రియను పెంచుతుంది. ఇలాంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది పెరుగు.
కానీ, పెరుగుతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంది. పెరుగుతో కలిపి తీసుకోకూడని ఆహారాలు ఏవో తెలుసుకుందాం..
కలిపి తినకూడని ఆహారాలు..
గుడ్లు..
పెరుగు- గుడ్లని కలిపి తింటే చర్మ వ్యాధులు, దురదలు వస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకొవడం వల్ల కొన్నిరకాల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వీటిని కలిపి తినకూడదట.
పాలు..
పెరుగు పాలతో మాత్రమే తయారు చేస్తారు, కానీ రెండింటినీ విడివిడిగా తీసుకోవాలి. పాలు, పెరుగు కలిపి తీసుకుంటే ఎసిడిటీ, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
పాలు-పెరుగు రెండింటిలో అధిక కొవ్వు , ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని కలిపి తినడం వల్ల జీర్ణక్రియ చెడిపోతుంది.

ఆకు కూరలు..
బచ్చలికూర , మెంతికూర వంటి పచ్చని ఆకు కూరలను కలిపి తినడం వల్ల కాల్షియం వంటి అనేక పోషకాల శోషణపై ప్రభావం పడుతుంది. కాబట్టి ఆకు కూరలతో పెరుగు తినకపోవడమే మంచిది.