365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 20,2023: Cowe, Sidbi ,My Home 8వ AVEKSHA చైల్డ్ డేకేర్,1వ నిర్మాణ కార్మికుల పిల్లల ప్రయోజనం కోసం ప్రారంభించింది.
రేపు సాయంత్రం నగరంలోని కోకాపేటలో మై హోమ్ నిషాద నిర్మాణ ప్రాంతం లో ప్రారంభించింది
ఈ కేంద్రంలో అరవై మంది చిన్నారులు సంరక్షణ పొందుతున్నారు. వీరు బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికుల పిల్లలు.
వారి తల్లిదండ్రులు 1400 రెసిడెన్షియల్ ఫ్లాట్ల నిర్మాణంలో పనిచేస్తుండగా, ఈ పిల్లలను అవేక్ష డే కేర్ సెంటర్ చూసుకుంటుంది.
మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామురావు ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
మిస్టర్ హిమాన్షు అస్థానా, రీజనల్ మేనేజర్, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) మరో అతిథిగా విచ్చేసినారు
అవేక్ష, అంటే ‘కేర్ ’ అనేది పారిశ్రామిక రంగం/నిర్మాణ రంగంలో లేదా సమాజంలోని ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళా కార్మికుల పిల్లలకు ఉద్దేశించిన డేకేర్ సౌకర్యం.
SIDBI ద్వారా ఆపరేషన్ ఖర్చులు,ప్రైవేట్ కార్పొరేట్లు లేదా పారిశ్రామిక సంఘాలు మౌలిక సదుపాయాల ఖర్చులకు మద్దతు ఇస్తాయి.
COWE గత 2 సంవత్సరాలలో పారిశ్రామిక ప్రాంతాలైన జీడిమెట్ల, చెర్లపల్లి, ఉప్పల్, మౌలాలి, పాశమైలారం,జీనోమ్ వ్యాలీలలో 7 అవేక్ష డే-కేర్ సెంటర్లను విజయవంతంగా ప్రారంభం.
ఈ సందర్భంగా మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామురావు మాట్లాడుతూ మై హోమ్ తమ కార్మికుల శ్రేయస్సు పట్ల చాలా సున్నితంగా వ్యవహరిస్తుందన్నారు.
ఇది ఒక గొప్ప చొరవ. మా ప్రాజెక్టులన్నీ చాలా పెద్దవి. మేము డేకేర్ సెంటర్ కోసం మా భవిష్యత్ నిర్మాణంలో COWEతో అనుబంధిస్తాము. ఒకరికొకరు ప్రగతిలో భాగస్వాములం అవుదాం అన్నారు.
భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఇది 1వ క్రెచ్ సౌకర్యం.
పారిశ్రామిక కార్మికుల సంపూర్ణ సంక్షేమం చాలా ముఖ్యమని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) రీజినల్ మేనేజర్ హిమాన్షు అస్థానా అన్నారు.
ఇది గొప్ప చొరవ ,మహిళా సాధికారతకు భరోసా ఇవ్వడంలో చాలా దూరం వెళ్తుందని ఆయన అన్నారు.