365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి3, 2024:“చరిత్ర సృష్టించే వారు ఎప్పుడూ మాటలు చెప్పరు, చేతులతో చేసి చూపిస్తారు. ఒక్కరు గానే వస్తారు ప్రజల గుండెల్లో నిలుస్తారు. చరిత్రను సృష్టించే తీరుతారు”.
ఇవి ఒక నాయకుని లక్షణాలు. చిన్నతనం నుంచి విద్యాభ్యాసంతో పాటు నాయక లక్షణాలు కూడా కలిగిన ప్రముఖ విద్యా వ్యవస్థలైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఆధ్వర్యంలో పల్లవి మోడల్ స్కూల్స్, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్, పల్లవి కిడ్స్ వ్యవస్థాపకులు, చైర్మన్ మల్కా కొమరయ్య అంచలంచెలుగా ఎదిగి తన జీవిత గమనంలో ప్రస్తుతం 45,000 లకు పైగా విద్యార్థులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.
ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే ఆశయంతో ప్రస్తుతం 2,000 మందికి ఉపాధిని కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడిన సునామి, కరోనా మొదలగు కష్ట సమయాల్లో ఆపద్బాంధవుడిలా బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరునిగా పర్యావరణ పరిరక్షణ, పురాతన కట్టడాల సంరక్షణ, జాతీయ నాయకుల స్మరణ మొదలైన అంశముల అవగాహనపై హెరిటేజ్ వాక్ లాంటి కార్యక్రమాలను ఎన్నింటినో నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించారు.
నేటి యువతకు చదువులతో పాటు క్రీడారంగంలో కూడా ఉన్నత అవకాశాలను కల్పించాలని ఉద్దేశంతో వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర, జాతీయస్థాయిలలో క్రీడా పోటీలను నిర్వహిస్తూ యువకులకు అవకాశాలను కల్పిస్తున్నారు.
విద్యార్థులలో ఉన్న నూతన ఆలోచనలను బహిర్గతం చేయాలని, అనేక రకాలైన పోటీలను నిర్వహిస్తూ విద్యార్థులు రాణించేలా కృషి చేస్తున్నారు.
ప్రస్తుత సమాజానికి ఇలాంటి నాయకుల అవసరం ఎంతో ఉంది. వీరి సేవలు కేవలం కొద్ది సంస్థలకే పరిమితం కాకుండా రాజకీయ రంగంలో అడుగుడి తమ సేవలను విస్తృతం చేస్తే క్రియా శీలక రాజకీయాలలోకి రావాలని ఆశిస్తున్నట్టుగా మల్కాజ్ గిరి నియోజవర్గ ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు తెలియజేశారు.