365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 6,2024: వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా గ్లోబల్ గ్రేస్ హెల్త్ ఫౌండేషన్ సంస్థ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సంస్థతో పాటు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అండ్ ఎస్ఎల్ఎస్ ట్రస్ట్ సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ సిక్కిల్ సెల్ అనెమియా పరీక్షలు జరిగాయి.
టెస్టుల అనంతరం పేషంట్స్‌కు అవసరమైన కిట్స్‌ను పంపిణి చేశారు. ఒరిస్సాలోని గిరిజన గ్రామాల్లో ఈ కార్యక్రమం జరిగింది.
సుమారు 11 గ్రామలు, 5,800 మంది జనాభాకు క్యాన్సర్ టెస్టులు జరిపారు.
ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం క్యాన్సర్‌ను ఇండియా నుంచి తరిమికొట్టడమే నని గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సుంకవల్లి చిన్నబాబు తెలిపారు.
దీనిలో భాగంగానే ప్రజల దగ్గరకు వెళ్లి క్యానర్స్ గురించి ఆవగాహన కలిగిస్తున్నామన్నారు.