Fri. Dec 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 2, 2024: ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం చందాదారుల గణాంకాల ప్రకారం, రిలయన్స్ జియో లో ఈ ఏడాది జనవరి నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2.59 లక్షలకు పైగా చందాదారులు కొత్తగా వచ్చి చేరారు.

ట్రాయ్ గణాంకాల ప్రకారం జనవరి లో జియో అత్యధికంగా 2,59,788 మొబైల్ చందాదారులను చేర్చుకుంది. దీంతో జియో కస్టమర్ల సంఖ్య 3.24 కోట్లకు చేరుకుంది. ఇదే నెలలో ఎయిర్టెల్ లో 1.18 లక్షల కొత్త మొబైల్ చందాదారులు చేరారు. మరోవైపు వోడాఐడియా 44,649 మంది సభ్యులను, బీఎస్ఎన్ఎల్ 16,146 మంది కస్టమర్లను కోల్పోయాయి.

జనవరి నెలలో దేశవ్యాప్తంగా జియో లో అత్యధికంగా 41.78 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. ఎయిర్టెల్ లో 7.52 లక్షల మంది చేరగా, వోడాఐడియా,బీఎస్‌ఎన్‌ఎల్ లు తమ కస్టమర్లను కోల్పోయాయి.

ఈ గణాంకాల ప్రకారం జనవరి 2024 నాటికి దేశంలో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య 52.67 కోట్లకు చేరుకుంది.

ఇది కూడా చదవండి33 శాతం పెరిగిన ఆడి కార్ల విక్రయాలు..

ఇది కూడా చదవండి :ఈ ఫీచర్ ను ఆపేసిన గూగుల్..

Also read : Reliance Jio Leads India’s 5G Revolution with Swift Deployment and Superior Performance: Ookla Report..

ఇది కూడా చదవండి‘నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ పాలసీ 2024’ రూపొందించేందుకు సిద్ధమైన TRAI..

Also read :WonderlaHyderabad Celebrates 8th Anniversary with Exciting Offers!

ఇది కూడా చదవండిRealme 12X 5G ఫీచర్స్..

ఇది కూడా చదవండిKia Carens 2024 కొత్త వేరియంట్ ప్రారంభం…

error: Content is protected !!