365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నేషనల్, ఏప్రిల్ 16,2024:దేశీయంగా అతి పెద్ద సమీకృత విద్యుత్ కంపెనీల్లో,దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సొల్యూషన్స్ కంపెనీల్లో ఒకటైన టాటా పవర్ కీలక మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా పబ్లిక్, సెమీ-పబ్లిక్, బస్సు/ఫ్లీట్ హోమ్ చార్జర్ సెగ్మెంట్లలో 10 కోట్ల (100 మిలియన్) హరిత కిలోమీటర్ల మేర ప్రయాణాలకు వెసులుబాటు కల్పించేలా చార్జింగ్ సదుపాయాలు అందించిన తొలి ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా ఘనత దక్కించుకుంది.
దేశవ్యాప్తంగా సుస్థిరమైన మొబిలిటీ సొల్యూషన్స్‌ను ప్రోత్సహించడంలో టాటా పవర్ కీలక పాత్ర పోషిస్తుండటాన్ని ఈ పరిణామం ప్రతిబింబిస్తోంది.

సుస్థిరమైన రవాణా సాధనాలను ఆవిష్కరించాలనే కేంద్రం దార్శనికతకు తోడుగా FAME వంటి పథకాలు ,నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ద్వారా 2030 నాటికి దేశీయంగా వాహన విక్రయాల్లో 30 శాతం వాటా విద్యుత్ వాహనాలదే ఉండేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఈ క్రమంలో భారీ ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషించనున్నాయి. దీన్ని గుర్తించే టాటా పవర్ సంస్థ EZ Charge (ఈజీ అని చదవాలి) పేరిట తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. దీనితో 530 నగరాలు, పట్టణాల్లో 86,000 పైచిలుకు హోమ్ చార్జర్లు, 5,300 పైచిలుకు పబ్లిక్, సెమీ-పబ్లిక్, ఫ్లీట్ చార్జింగ్ పాయింట్లతో పాటు 850 పైగా బస్సు చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి.
ఈ చార్జర్లనేవి హైవేలు, హోటళ్లు, మాల్స్, హాస్పిటల్స్, ఆఫీసులు, రెసిడెన్షియల్ కాంప్లెక్సులు వంటి వివిధ ప్రదేశాల్లో సులభంగా అందుబాటులో ఉండే విధంగా, వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ గణనీయంగా వృద్ధి చెందడంలో ఈ సమిష్టి కృషి కీలక పాత్ర పోషిస్తోంది.

పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం 2030 నాటికి భారత్‌లో ఏటా 1 కోటి ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడు కానున్నాయి. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించిన టాటా పవర్ ఈ దిశగా జరిగే కృషిలో ముందుండనుంది.
ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈవీ యూజర్లకు tap.charge.go సదుపాయాన్ని కల్పించే ఆర్‌ఎఫ్ఐడీ కార్డులువంటి టెక్ ఆధారిత సొల్యూషన్స్‌ను కూడా టాటా పవర్ అందుబాటులోకి తెచ్చింది. వైర్‌లెస్ చెల్లింపులకు ఇవి వీలు కల్పిస్తాయి.
సున్నా స్థాయి ఉద్గారాలు ఉండే మొబిలిటీ సొల్యూషన్స్ విషయంలో మొక్కవోని నిబద్ధత చూపుతున్నందుకు గాను టాటా పవర్ సంస్థకు ప్రతిష్టాత్మకమైన ‘శూన్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాంపియన్’ పురస్కారం కూడా దక్కింది.

న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన 2వ వార్షిక శూన్య ఫోరమ్‌లో కంపెనీకి దీన్ని ప్రదానం చేశారు. 2021లో నీతి ఆయోగ్ శూన్య-జీరో పొల్యూషన్ మొబిలిటీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. MyGov, భారత ప్రభుత్వ సిటిజన్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్, పరిశ్రమలో దాదాపు 200 పైచిలుకు సంస్థల మధ్య భాగస్వామ్యానికి ఇది తోడ్పడింది.
ఈ-కామర్స్,ఫుడ్ డెలివరీ సంస్థలు, వాహన సేవల సంస్థలు, వాహనాల తయారీ సంస్థలు, ఫ్లీట్ అగ్రిగెటర్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్లు, ఫైనాన్షియర్ల మధ్య ఏర్పడిన భాగస్వామ్యాలు, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వ్యవస్థలో అంతర్గతంగా స్వచ్ఛమైన మొబిలిటీ ముఖచిత్రాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Also read :Analysts bullish on power sector stocks as the Ministry of Power extends Sec 11 deadline till October 15, 2024
Also read :TRENDS, INDIA’S LARGEST FASHION DESTINATION NOW OPENS IN KAGHAZNAGAR
ఇది కూడా చదవండి: ఏప్రిల్ 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీకోదండరామాలయంలో ఘనంగా శ్రీ రామనవమి ఉత్సవాలు..