Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై ,ఏప్రిల్ 18,2024: మహీంద్రా గ్రూప్‌లో భాగమైన,పరిమాణంపరంగా ట్రాక్టర్ల తయారీలో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ అయిన మహీంద్రా ట్రాక్టర్స్ 2024 మార్చిలో 40 లక్షల ట్రాక్టర్ల అమ్మకాల మైలురాయిని (ఎగుమతులు కూడా కలిపి) అధిగమించింది.

మహీంద్రా కొత్త తరం యువో ట్రాక్టర్ ప్లాట్‌ఫాం ఆధారిత మహీంద్రా యువో టెక్ ప్లస్‌తో ఈ ఘనత సాధ్యపడింది. ఇది మహీంద్రా కొత్త ట్రాక్టర్ ప్లాంటు మరియు అంతర్జాతీయంగా మహీంద్రా ట్రాక్టర్లకు తయారీ హబ్‌గా ఉన్న మహీంద్రా జహీరాబాద్ ప్లాంటులో తయారైంది.

అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ హార్వెస్టర్ ఇంక్ సంస్థ భాగస్వామ్యంతో 1963లో తొలి ట్రాక్టరును రూపొందించిన మహీంద్రా ట్రాక్టర్స్ 2004లో 10 లక్షల ట్రాక్టర్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించింది. ఆ తర్వాత 2009లో పరిమాణంపరంగా ప్రపంచంలోనే అత్యధికంగా ట్రాక్టర్లను విక్రయించే తయారీ సంస్థ హోదాను దక్కించుకుంది.

9 ఏళ్ల తర్వాత 2013లో మహీంద్రా 20 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించింది. ఆ తర్వాత 2019లో 30 లక్షల మార్కును దాటింది. అటుపైన కేవలం 5 ఏళ్ల వ్యవధిలోనే 2024లో మహీంద్రా ట్రాక్టర్స్ తమ 40 లక్షలవ ట్రాక్టరును విక్రయించడం గర్వకారణం. ఆర్థిక సంవత్సరం మొత్తం మీద మహీంద్రా ట్రాక్టర్ బ్రాండు ఏకంగా 2 లక్షల యూనిట్లను విక్రయించింది.

“వ్యవసాయ రంగంలో పరివర్తన తేవడం, జీవితాలను మెరుగుపర్చడమనే మా లక్ష్యాలకు అనుగుణంగా మా 40 లక్షలవ ట్రాక్టరును విక్రయించడం మాకెంతో గర్వకారణం. దశాబ్దాలుగా ఈ విభాగంలో నాయకత్వ స్థానంలో ఉంటున్న మహీంద్రా ట్రాక్టర్ 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సంవత్సరంలోనే ఈ ఘనత కూడా సాధించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

మరో కొత్త ప్రస్థానానికి సిద్ధమవుతున్న తరుణంలో, ఈ మైలురాళ్లను అధిగమించడంలో మా వెన్నంటి ఉంటూ, మాకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మా కస్టమర్లు, రైతులకు, అలాగే మా భాగస్వాములకు మరియు మా బృందాలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం” అని మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టర్ ప్రెసిడెంట్ శ్రీ హేమంత్ సిక్కా తెలిపారు.

“మహీంద్రా ఫార్మ్ డివిజన్‌లోని మాకు ఇది ఎంతో గర్వకారణమైన సందర్భం. 40 లక్షల ట్రాక్టర్లను విక్రయించడమనేది మా బ్రాండుపైన కస్టమర్లు ఉంచిన నమ్మకానికి, అలాగే భారతీయ వ్యవసాయ రంగంపై మాకు గల లోతైన పరిజ్ఞానానికి ప్రబల నిదర్శనం. గత 5 ఏళ్లు అద్భుతంగా గడిచాయి. మేము అత్యంత వేగంగా పది లక్షల ట్రాక్టర్ల విక్రయాలను సాధించాం.

అదే విధంగా రాబోయే రోజుల్లోనూ రైతు అభివృద్ధికి తోడ్పడేలా గ్లోబల్-ఫస్ట్ టెక్నాలజీలను అందిస్తూ, అసమానమైన విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తూ, విస్తృతమైన ట్రాక్టర్ల పోర్టుఫోలియోతో మా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వారికి తోడ్పాటు అందించేందుకు కట్టుబడి ఉంటాం” అని మహీంద్రా ట్రాక్టర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ విక్రమ్ వాఘ్ తెలిపారు.

60 ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న మహీంద్రా విస్తృత పోర్టుఫోలియోలో 390 పైచిలుకు ట్రాక్టర్ మోడల్స్ ఉన్నాయి. ఈ వ్యవధిలో మహీంద్రా ట్రాక్టర్స్ దేశవ్యాప్తంగా 1,200 పైచిలుకు డీలర్ పార్ట్‌నర్స్‌తో పటిష్టమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది.

కస్టమరు అవసరాలకు అనుగుణంగా సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తోంది. 40 లక్షల పైచిలుకు మహీంద్రా ట్రాక్టర్స్ కస్టమర్లకు అసమానమైన సేల్స్, సర్వీస్, స్పేర్స్‌పరమైన తోడ్పాటు అందిస్తోంది.

దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులు, సర్వీసులపై సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ, అదే సమయంలో తమ 40 లక్షల మంది కస్టమర్లకు కృతజ్ఞతాసూచకంగా ‘40 lakh happy customers and 60 years of brand trust’ (40 లక్షల మంది సంతుష్ట కస్టమర్లు, 60 ఏళ్లుగా విశ్వసనీయమైన బ్రాండ్) పేరిట కొత్తగా డిజిటల్ వీడియో కమర్షియల్ (DVC)ని కంపెనీ ఆవిష్కరించింది. శ్రేయస్సుకు ,మహీంద్రా ట్రాక్టర్స్‌కి ప్రతీకగా ఉండే ‘ఎరుపు’ రంగు చుట్టూ ఈ ప్రచార కార్యక్రమం ఉంటుంది.

మహీంద్రా ట్రాక్టర్ కొత్త డీవీసీని వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:

(https://www.youtube.com/watch?v=y_76wOT94n0)

అంతర్జాతీయంగా ఆరు ఖండాల్లోని 50 దేశాల్లో మహీంద్రా ట్రాక్టర్స్ కార్యకలాపాలు విస్తరించింది. కంపెనీకి భారత్ వెలుపల అమెరికా (U.S.) అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. జపాన్‌కి చెందిన మిత్సుబిషి మహీంద్రా అగ్రికల్చర్ మెషినరీ భాగస్వామ్యంతో మహీంద్రా తేలికపాటి ట్రాక్టర్ ప్లాట్‌ఫాం OJAను అభివృద్ధి చేసింది.

ఇటీవలే అమెరికాలో OJA విక్రయాలను ప్రారంభించింది. OJAతో మహీంద్రా ట్రాక్టర్స్ సంస్థ 2024లో థాయ్‌ల్యాండ్‌తో మొదలుపెట్టి ASEAN కూటమి దేశాల్లోకి అడుగుపెట్టనుంది. 2025లో యూరప్ మార్కెట్లో విక్రయించనుంది. తద్వారా అంతర్జాతీయ ట్రాక్టర్ మార్కెట్లో ఒక దిగ్గజ ట్రాక్టర్ బ్రాండుగా మహీంద్రా ట్రాక్టర్స్ తన స్థానాన్ని పటిష్టం చేసుకోనుంది.

Also read : Mahindra Tractors crosses Milestone by Selling 40 Lakh Tractor Units

Also read : Airtel Payments Bank Launches Interoperable Eco-friendly NCMC Enabled Debit and Pre-paid Cards

Also read : MG Motor India joins forces with Epsilon Group to enhance EV Ecosystem in India

Also read : PBPartners unveils its future-ready vision at annual flagshipbusiness meet, Shapath 3.0 

Also read : NPCI Bharat BillPay Partners with SBI to Introduce NCMC Recharge as a New Biller Category.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఓటర్ల జాబితా నుంచి 5,41,201 మంది తొలగింపు..

error: Content is protected !!