Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్,మే 3,2024:అసలు ఏదైనా పథకం అమలు చేయాలంటే కదా ముందూ వెనకా చూడాలి… ఆలోచించాలి…బడ్జట్ లెక్కలు వేయాలి… ఇవ్వనిదానికి ఎన్నినా చెప్పొచ్చు..ఏమైనా మాట్లాడొచ్చు.. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ హామీలదీ అదీ దారి.. గత ముప్పయ్ ఏళ్లలో ఇచ్చిన హామీలు ఎలాగైతే గాలిలో కలిసిపోయాయి..ఈ హామీలూ అంతే

బాబు చెబుతున్న బీసీ మహిళలల్లో పెన్షన్ ఇవ్వాలంటే 32-33 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి నెలకు రూ.4వేల చొప్పున ఇవ్వాలంటే నెలకు దాదాపు రూ.1,400 కోట్లు కావాలి. నిరుద్యోగ యువతకు నెలకు రూ. మూడు వేలు ఇవ్వాలంటే రాష్ట్రంలోని 20 లక్షలమందికీ రూ.600 కోట్లు కావాలి.

ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లతో కలిపి నెలకు రూ.4,800 కోట్లు, వాలంటీర్లు 2 లక్షల 65 వేల మంది ఉన్నారు, ఒక్కొక్కరికీ రూ.10 వేలు అంటే రూ.265 కోట్లు,

18 -50 ఏళ్ళ వరకు ఉన్న మహిళలకు రూ.1,500 చొప్పున ఇస్తామంటున్నారు వీళ్లు రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నారు. ఇది దాదాపు రూ.1,200 కోట్ల వరకు అవుతుంది. అంతే మొత్తం దాదాపు రూ.13,200 కోట్లు ప్రతి నెలా ఒకటో తారీఖునే ఉదయానికల్లా రెడీగా ఉండాలి.

గతంలో చంద్రబాబు నాయుడు ఐదేళ్లపాటు సృష్టించిన సంపద చూస్తే … అయన దిగి వెళ్లిపోయే నాడు ఖజానాలో ఉన్నది రూ.100 కోట్లు.

ఆరోగ్యశ్రీ, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ పిల్లకు పెట్టె ఆహారం.. వసతిదీవెన, విద్యాదీవెన ప్రభుత్వ బడుల్లో నాడు-నేడు పనులు ఇవన్నీ కాకుండానే మామూలుగా పథకాలకు ప్రతి నెలా ఒకటో తారీఖు ప్రొద్దుటికే రూ.13,200 కోట్లు కావాలి.

పక్కరాష్ట్రాల నుంచి కాపీకొట్టి తెచ్చిన ఈ పథకాలను అమలు చేయాలంటే బడ్జట్ కూడా పక్కరాష్ట్రంతో సమానంగా ఉండాలి..లేదా సింపుల్ గా చంద్రబాబుకున్న అలవాటు ప్రకారం పథకాలు ఎగ్గొట్టేయాలి. ఎగ్గొట్టటం ఆయనకు ఉన్న అలవాటు కాబట్టి అమలు చేయడం కన్నా ఎగ్గొట్టడమే సులువు కావట్టి… ఆయన దానికే ప్రాధాన్యం ఇచ్చి… ఎప్పట్లానే ప్రజలను మోసం చేస్తారు…

అయన చరిత్ర తెలిసినందులే చంద్రబాబు ఈ పథకాలను అమలు చేస్తాడనే నమ్మకం లేకనే బీజేపీ ఆ మేనిఫెస్టోను సైతం టచ్ చేయకుండా పక్కకు జరిగింది.

Also read: A safe and educative ecosystem for children of construction workers, 2nd Meru Aveksha Day Care Center inaugurated

Also read:  Blue Star’s FY24 Total Income rises 21.4% to Rs 9685.36 crores

Also read: Enjoy the Great Summer Sale on Amazon.in starting on May 2, 2024, and start having fun this summer!

Also read: The mission of Indian Chess Masters is to bring World Champions to India.

ఇది కూడా చదవండి: వరల్డ్ ఛాంపియన్స్ ను భారత్ కు అందించడమే ఇండియన్ చెస్ మాస్టర్స్ ధ్యేయం: అరుణ్ జూపల్లి..

Also read: Reliance Retail’s Tira Beauty Unveils New Private Label Brand: ‘Nails Our Way’

error: Content is protected !!