365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 31,2024: దిగ్గజ టెలికం ఆపరేటర్ వి (Vi) అంతర్జాతీయ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ – నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు నేడు ప్రకటించింది.
ఈ భాగస్వామ్యంతో వి యూజర్లు తమకు ఇష్టమైన ఏ డివైజ్‌లోనైనా, అంటే, మొబైల్, టీవీ లేదా ట్యాబ్లెట్‌ప్ ప్రపంచ స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అత్యుత్తమ స్ట్రీమింగ్ అనుభూతితో ఆస్వాదించగలరని తెలిపింది.
ప్రస్తుతానికి దీన్ని ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రవేశపెట్టగా, త్వరలో నెట్‌ఫ్లిక్స్‌తో బండిల్ చేసిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను కూడా ఆవిష్కరించనున్నట్లు సంస్థ వివరించింది.
హీరామండి: ది డైమండ్ బజార్, అమర్ సింగ్ చమ్కీలా, ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో, లాపతా లేడీస్, యానిమల్, స్క్విడ్ గేమ్, బ్రిడ్జర్‌టన్ వంటి స్థానిక, అంతర్జాతీయ సినిమాలు, సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ భారత విభాగం ఇటీవలే శక్తిమంతమైన 2024 లైనప్‌ను కూడా ప్రకటించింది.
నెట్‌ఫ్లిక్స్‌ను మొబైల్ అలాగే టీవీలో కూడా చూసేందుకు వీలు కల్పించేలా నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌తో అపరిమిత కాల్స్ & డేటాను ఆఫర్ చేసే రెండు కొత్త అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్యాక్‌లను వి ప్రవేశపెట్టింది.
అంశం
ప్యాక్ 1*
ప్యాక్ 2
ఎంఆర్‌పీ
998
1399
వేలిడిటీ
70
84
డేటా
1.5GB/రోజుకు
2.5GB/ రోజుకు
ఎస్ఎంఎస్
100 ఎస్ఎంఎస్/రోజుకు
100 ఎస్ఎంఎస్/రోజుకు
వాయిస్
అన్‌లిమిటెడ్
అన్‌లిమిటెడ్
ఓటీటీ ప్రయోజనాలు
నెట్‌ఫ్లిక్స్ బేసిక్ (టీవీ లేదా మొబైల్)
నెట్‌ఫ్లిక్స్ బేసిక్ (టీవీ లేదా మొబైల్)
· ముంబై, గుజరాత్‌లోని కస్టమర్లు రూ. 1,099 ప్యాక్‌తో 70 రోజుల వేలిడిటీ ఆఫర్‌ను పొందగలరు
ప్రస్తుతం ప్రీపెయిడ్ ప్లాన్‌తో రూ. 1,000 కన్నా తక్కువకే నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్యాక్‌ను అందిస్తున్న ఏకైక టెలికం ఆపరేటరుగా వి ఉంది.
పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు 84 రోజుల వేలిడిటీ ప్యాక్‌తో రీచార్జ్ చేయించుకునే వి యూజర్లు డేటా డిలైట్, నైట్ బింజ్, వీకెండ్ డేటా రోలోవర్ వంటి ఫ్లాగ్‌షిప్ హీరో ప్రయోజనాలను కూడా పొందవచ్చు.