Fri. Dec 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 9, 2024: రియల్ ఎస్టేట్ పరిశ్రమలో అగ్రగామిగా పేరుగాంచిన బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ (బీబీజీ)‌.. ఈటీ నౌ ద్వారా 2024లో ఉత్తమ రియాల్టీ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అగ్రగామిగా తన స్థానాన్ని పటిష్టం చేస్తుంది. ఈ సందర్భంగా బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ సీఎండీ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ ఈ గుర్తింపు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. బీబీజీ అగ్రస్థానానికి చేరుకోవడంలో కస్టమర్ల సంతృప్తి పట్ల తిరుగులేని నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు.

ఉత్తమ ప్రాజెక్ట్‌లు, అసమానమైన కస్టమర్ సేవలు అందించడంలో అంకితభావం ఎనలేనిదన్నారు. ఒక సాధారణ వ్యక్తి కల ఎప్పుడూ భూమిని సొంతం చేసుకోవాలనే ఉంటుందన్నారు. బీబీజీ భారతీయుల కోసం పని చేస్తోందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో అవకాశాలను అందించడం ద్వారా కలలను నిజం చేస్తుందన్నారు.

‌బీబీజీ విజయగాథ సమగ్రత, పారదర్శకత, ఆవిష్కరణల పునాదిపై నిర్మించబడిందని తెలిపారు. మూడు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన నిపుణుల బృందం ఎంతో మంది సొంతింటి కలలకు చేదోడుగా ఉంటుందన్నారు. తమ కస్టమర్‌లకు ‘ది ల్యాండ్ ఆఫ్ ప్రాస్పెరిటీ’ని అందించడానికి నాయకత్వం వహిస్తున్నామని పేర్కొన్నారు.

 ‌‌‌వరుసగా మూడో సంవత్సరం ఈటీ నౌ ద్వారా బెస్ట్ రియాల్టీ బ్రాండ్‌గా గుర్తించబడడం గౌరవంగా ఉందన్నారు.ఈ ప్రతిష్టాత్మక పురస్కారం మా టీమ్ కృషి, అంకితభావం, అభిరుచికి నిదర్శనమన్నారు. కస్టమర్‌లకు అసాధారణమైన విలువను, నాణ్యతను అందించడం ద్వారా రియల్ ఎస్టేట్ ల్యాండ్‌స్కేప్‌లో విప్లవాత్మక మార్పులకు కట్టుబడి ఉన్నామన్నారు. బీబీజీ దృష్టి రియల్ ఎస్టేట్‌కు మించి విస్తరించిందన్నారు.


 బాలికాసాధికారతకు కట్టుబడి ఉన్నామన్నారు. 2040 నాటికి రెండు మిలియన్ల మంది బాలికల జీవితాలను లక్ష్యంగా పెట్టుకున్నామని‌ తెలిపారు.గాంధీ ప్రపంచ దృష్టి కోణానికి అనుగుణంగా.. సమాజ సేవలో పాలుపంచుకుంటున్నామని పేర్కొన్నారు. భూమిని కలిగి ఉండటం ద్వారా సురక్షితమైన, దీర్ఘకాలిక పొదుపునకు అవకాశం ఉంటుందన్నారు. మరింత సమాచారం కోసం. https://www.bbgindia.com/homeని సందర్శించాలని కోరారు. 
error: Content is protected !!