365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 6,2024: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల, జాతీయ సేవా పథకం విభాగం ఆధ్వర్యంలో “ఏక్ పేడ్ మాకె నామ్” కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయం హెల్త్ సెంటర్ ఆవరణలో శనివారం వివిధ రకాల మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ జెల్లా సత్యనారాయణ హాజరై మొక్కలను నాటి, పర్యావరణంలో మొక్కల ప్రాముఖ్యతను తెలియజేస్తూ, మొక్కలను నాటడం కాదు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత NSS వాలంటీర్లపై ఉందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సి. నరేంద్ర రెడ్డి, డాక్టర్ ఎం. మాధవి, సీనియర్ ప్రొఫెసర్ & యూనివర్సిటీ హెడ్, హెల్త్ సెంటర్ ఇన్చార్జ్ డాక్టర్ సి. పద్మవేణి, బోధన, బోధనేతర సిబ్బంది, హెల్త్ సెంటర్ సిబ్బంది, NSS అధికారులు,వాలంటీర్లు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి:అందరికి నచ్చే కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం: నిర్మాత శాన్వి కేదారి..

ఇదికూడా చదవండి:రిలయన్స్ జియో ధర అండ్ ఎయిర్‌టెల్-వి ఈ రెండు వాటిలో ఏది తక్కువ ధర …

Also read : “Tough Times Don’t Last, Tough People Do”..

ఇదికూడా చదవండి:పాకిస్థాన్ లో సోషల్ మీడియా పై నిషేధం

ఇదికూడా చదవండి:విద్యుత్ బిల్లులు చెల్లించడానికి క్యూఆర్ కోడ్ ను వాడాల్సిందే..

Also read :Steel Secretary Visits NMDC’s New State-of-the-art R&D Centre

ఇదికూడా చదవండి: ప్రపంచంలోనే మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్ ‘ఫ్రీడమ్’ను విడుదల చేసిన బజాజ్..