365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 25,2024: సురక్షా డయాగ్నోస్టిక్ లిమిటెడ్ తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ని (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది.
దీని ప్రకారం సెల్లింగ్ షేర్హోల్డర్లు 1,91,89,330 వరకు ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నారు.
సోమనాథ్ చటర్జీ, దివంగత కిషన్ కుమార్ కేజ్రీవాల్ 1992లో కోల్‌కతా కేంద్రంగా ‘సురక్షా’ బ్రాండ్ పేరిట సమగ్ర డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇది పాథాలజీ, రేడియాలజీ టెస్టింగ్, మెడికల్ కన్సల్టేషన్ సర్వీసెస్ మొదలైనవి అందిస్తోంది.
క్రిసిల్ నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయంపరంగా తూర్పు భారత్‌లో అతి పెద్ద ఫుల్ సర్వీస్, ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ చెయిన్‌గా ఉంది.
2024 మార్చి 31 నాటికి కంపెనీకి పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, మేఘాలయాలో 8 శాటిలైట్ ల్యాబరేటరీలు, 194 కస్టమర్ టచ్పాయింట్లు ఉన్నాయి. 2,300 పైచిలుకు టెస్టుల సేవలు అందిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో సుమారు 11.4 లక్షల మంది పేషంట్లకు 59.8 లక్షల టెస్టులు నిర్వహించింది.
డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ఓఎఫ్ఎస్ కింద ఇన్వెస్టర్ సెల్లింగ్ షేర్‌హోల్డరు ఆర్బిమెడ్ ఏషియా II మారిషస్ లిమిటెడ్ 1,06,60,737 షేర్లను; ప్రమోటర్ సెల్లింగ్ షేర్హోల్డర్లు Dr. సోమ్‌నాథ్ చటర్జీ, రీతు మిట్టల్, సతీష్ కుమార్ వర్మ తలో 21,32,148 షేర్లను; వ్యక్తిగత సెల్లింగ్ షేర్హోల్డర్లు మున్నా లాల్ కేజ్రీవాల్ ,సంతోష్ కుమార్ కేజ్రీవాల్ వరుసగా 7,99,556 ,13,32,593 షేర్ల వరకు విక్రయించనున్నారు.
ఐసీఐసీఐ సెక్యూరిటీస్, నువామా వెల్త్ మేనేజ్మెంట్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్‌గా వ్యవహరిస్తున్నాయి.
Also Read: Suraksha Diagnostic Limited files DRHP with SEBI
Also Read: Mrs. Nita M. Ambani Re-Elected Unanimously as IOC Member
ఇదికూడా చదవండి: త్వరలో మార్కెట్ లోకి iPhone ఫోల్డబుల్ ఫ్లిప్..
ఇదికూడా చదవండి: రూ.1,399కే ఫోన్! UPI సిస్టమ్, లైవ్ జియో టీవీ,జియో చాట్‌తో సహా..
ఇదికూడా చదవండి: జనాలను ఆకర్షిస్తున్న BSNL రీఛార్జ్ ప్లాన్లు..