365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,ఆగస్టు 12,2024: సీనియర్ సిటిజన్స్ విశిష్ట అవసరాలను తీర్చే విధంగా రూపొందించిన సమగ్ర ప్రయారిటీ బ్యాంకింగ్ ప్రోగ్రాం ‘డీబీఎస్ గోల్డెన్ సర్కిల్’ను ప్రారంభించినట్లు డీబీఎస్ బ్యాంక్ ఇండియా వెల్లడించింది.
60 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులకు ప్రత్యేక ప్రయోజనాలు, సర్వీసులు అందించేలా రూపొందించిన ఈ ప్రోగ్రాంతో బ్యాంకింగ్ లావాదేవీలు మరింత సులభతరం కాగలవు.
భారత్‌లో తమ 30వ వార్షికోత్సవం సందర్భంగా డీబీఎస్ దీన్ని ఆవిష్కరించింది. ఈ కీలక మైలురాయిని అధిగమించడమనేది స్థానిక మార్కెట్‌పై డీబీఎస్‌కు గల నిబద్ధతకు నిదర్శనం. డీబీఎస్ బ్యాంక్ ఇండియా తమ విస్తృతమైన ఫిజికల్ నెట్‌వర్క్, డిజిటల్ సామర్ధ్యాలను సమర్ధమంతంగా వినియోగించుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన సొల్యూషన్స్‌ను అందించేందుకు, విశ్వసనీయతను పెంపొందింపచేసేందుకు, దీర్ఘకాల సంబంధాలను ఏర్పర్చుకునేందుకు కృషి చేస్తోంది.
యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రూపొందించిన ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ప్రకారం ఆదాయ భద్రత లేకపోవడం మలి వయస్సులో పెద్ద సవాలుగా ఉంటోంది. జీవన వ్యయాలు పెరిగిపోతుండటం, పెట్టుబడులను ముట్టుకోకుండా నిధులను సమకూర్చుకోవడంలో ఎదురవుతున్న సవాళ్లతో ఈ దశలో పొదుపు మొత్తాలను సమర్ధమంతంగా వినియోగించుకోవడమనేది మరింత సంక్లిష్టంగా ఉంటోంది.
‘డీబీఎస్ గోల్డెన్ సర్కిల్’ ఈ సవాళ్లకు పరిష్కారం అందిస్తోంది. పొదుపు ఖాతాలు, డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేటు ఆఫర్ చేయడమనేది ఇందులోని ప్రధాన ఫీచర్లలో ఒకటి. సీనియర్ సిటిజన్లు తమ పొదుపు ఖాతాల్లో రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు బ్యాలెన్స్‌లపై వార్షికంగా 7 శాతం వరకు వడ్డీ రేటును పొందవచ్చు.
అంతేగాకుండా, 376 రోజుల నుంచి 540 రోజుల వరకు కాలవ్యవధి ఉండే ఫిక్సిడ్ డిపాజిట్లపై అదనంగా 0.50 శాతం మేర వార్షిక వడ్డీ రేటు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు తమ పొదుపు మొత్తాలను పెంచుకునేందుకు, మరింత ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు ఈ మెరుగైన వడ్డీ రేట్లు తోడ్పడగలవు.
“విశ్వసనీయత, భద్రత, సౌకర్యం అంశాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ సీనియర్ సిటిజన్లకు బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణ మరింత సులభతరంగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసేందుకు డీబీఎస్ గోల్డెన్ సర్కిల్ రూపొందించబడింది.
సురక్షితమైన, విశ్వసనీయమైన,సీనియర్ సిటిజన్స్ విశిష్ట అవసరాలకు అనుగుణమైన బ్యాంకింగ్ అనుభూతిని అందించడం ద్వారా మా కస్టమర్లు ఈ దశను నిశ్చింతగా ఆస్వాదించేలా సాధికారత కల్పించేందుకు ఇది ఉద్దేశించబడింది.
‘లివ్ మోర్, బ్యాంక్ లెస్’ అనే మా బ్రాండ్ హామీకి అనుగుణంగా ఇది రూపొందించబడింది. ఇటు టెక్నాలజీ, అటు పర్సనల్ టచ్‌తో సీనియర్ సిటిజన్ల అవసరాలకు తగ్గట్లుగా రూపొందించిన సేవలతో వారికి రెండిందాల ప్రయోజనాలు కల్పించేందుకు దోహదం చేస్తుంది” అని డీబీఎస్ బ్యాంక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ కన్జూమర్ బ్యాంకింగ్ గ్రూప్ ప్రశాంత్ జోషి తెలిపారు.
సీనియర్ సిటిజన్లు ఎక్కువగా భద్రతకు ప్రాధాన్యమిస్తారు. అందుకే ‘డీబీఎస్ గోల్డెన్ సర్కిల్’ ప్రోగ్రాంలో రూ. 1,00,000 వరకు సైబర్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు ఆర్థిక ప్రణాళిక సరళతరమైనదిగా ఉండాలి.
అందుబాటులో ఉండాలి. అందుకే వారి కోసం ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీని నెలవారీ, త్రైమాసికాలవారీ లేదా క్యుములేటివ్ పేఅవుట్స్ రూపంలో అందుకునేలా తగు ఆప్షన్స్‌ను ఎంచుకునే వెసులుబాటును ఈ ప్రోగ్రాం కల్పిస్తుంది.
అంతే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్లకు సత్వరం తమ నిధులు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఏడాది పైబడిన కాలవ్యవధి ఉండే ఫిక్సిడ్ డిపాజిట్లను ముందస్తుగా విత్‌డ్రా చేసుకున్నా ఎటువంటి పెనాల్టీలు ఉండవు.
డీబీఎస్ గోల్డెన్ సర్కిల్‌తో ఇతర ప్రయోజనాలు ఏమిటంటే:
.ఎఫ్‌డీలు, డిపాజిట్ల మీద రుణాలపై ప్రత్యేక ఓవర్‌డ్రాఫ్ట్ రేట్లు
.NEFT, RTGS, డూప్లికేట్ స్టేట్‌మెంట్లుపై జీరో ట్రాన్సాక్షన్ ఫీజులు,దేశీయంగా అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీలు.
.లైఫ్‌టైమ్ ఉచిత డెబిట్ కార్డులు
.విలువైన ఐటమ్‌లను సురక్షితంగా, తక్కువ వ్యయాలతో భద్రపర్చుకునేందుకు లాకర్ రెంటల్స్‌పై డిస్కౌంటు
.ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్యం, వెల్‌నెస్ ప్రయోజనాలను అందించేలా పేరొందిన జీవిత బీమా కంపెనీలు, ఎకోసిస్టమ్ పార్ట్‌నర్స్ నుంచి ఉత్పత్తులు, హెల్త్‌కేర్ సర్వీసులపై డిస్కౌంట్లు, ఫార్మసీ డిస్కౌంట్లు, హాస్పిక్యాష్ ప్రయోజనాలు,సమగ్రమైన వార్షిక హెల్త్ చెకప్‌లు.
గ్లోబల్ ఫైనాన్స్ నుంచి వరుసగా 15 సంవత్సరాల పాటు ‘ఆసియాలోనే అత్యంత సురక్షితమైన బ్యాంకు’గా డీబీఎస్ గుర్తింపును పొందింది. భారత్‌పై లోతైన అవగాహనతో పాటు అంతర్జాతీయంగా గల అపార అనుభవాన్ని రంగరించి సేవలు అందిస్తోంది.
తమ ప్రీమియం బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫాం, ట్రెజర్స్ ద్వారా డీబీఎస్ బ్యాంక్ ఇండియా సిగ్నేచర్ లైఫ్‌స్టయిల్ ప్రయోజనాలు, ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. కస్టమర్లు తమ స్వల్పకాలిక అవసరాలు, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనువైన సొల్యూషన్స్ ను తమ రిస్కు సామర్ధ్యాలకు అనుగుణంగా పొందవచ్చు.
ఆరోగ్యం, వ్యాపారం, ట్రావెల్, లైఫ్ మొదలైన వాటన్నింటికీ సంబంధించి బీమా పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. అదనంగా, నిరాటంకంగా సీమాంతర నగదు బదిలీలకు సంబంధించి డీబీఎస్ ట్రెజర్స్ కస్టమర్లు ప్రిఫరెన్షియల్ రెమిటెన్స్ రేట్లు,సొల్యూషన్స్ కూడా పొందవచ్చు.
క్రిసిల్ రీసెర్చ్ అధ్యయన నివేదికల ప్రకారం టాప్ ర్యాంక్ గల మ్యుచువల్ ఫండ్స్ సహా రెడీమేడ్ మ్యుచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలను కస్టమర్లు తమ వయస్సు, ఆదాయం, రిస్కు సామర్థ్యాలకు అనుగుణంగా ఎంచుకునేందుకు మానవ అనుభవం, సాంకేతికతల మేలు కలయికతో డీబీఎస్ బ్యాంక్ ఇండియా డిజిపోర్ట్‌ఫోలియో సహాయకరంగా ఉంటుంది.
2023లో బ్యాంక్ డీబీఎస్ వాంటేజ్ కార్డ్ అనే ఇన్వైట్-ఓన్లీ, సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డును ఆవిష్కరించింది. ఇది లగ్జరీ హోటల్స్‌లో కాంప్లిమెంటరీ మెంబర్‌షిప్, ప్రత్యేకమైన రివార్డ్స్ ప్రోగ్రాం, అంతర్జాతీయంగా ట్రావెల్ బెనిఫిట్స్‌తో పాటు పలు ప్రయోజనాలు అందిస్తుంది.
టెక్నాలజీ వేగంగా పురోగమిస్తూ మన రోజువారీ జీవితాల్లో అఁతర్భాగమయ్యే కొద్దీ డిజిటల్ బ్యాంకింగ్ తీరుతెన్నుల గురించి సీనియర్ సిటిజన్లు సహా తమ కస్టమర్లకు అవగాహన కల్పించడంపై డీబీఎస్ గణనీయంగా కృషి చేస్తోంది.
స్కాముల అవకాశాలను గుర్తించడంతో పాటు తమ వ్యక్తిగత,ఆర్థిక సమాచారాన్ని భద్రంగా ఉంచుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం వంటి విషయాల్లో మార్గదర్శకత్వం వహిస్తోంది.