365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ ఆగస్టు 13,2024:హైడ్రా కమిషనర్గా ఉన్న ఏవీ రంగనాథ్ పై దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుగా భావిస్తున్నారు. అందుకే నాపై కేసు పెట్టారంటూ దానం నాగేందర్ ఆరోపించారు.అధికారులు వస్తుంటారు, పోతుంటారు, కానీ నేను లోకల్ అని పేర్కొన్నారు.
నందగిరి హిల్స్ హుడా లేఔట్ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని,అలాగే అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. సీఎం రేవంత్ కు కూడా ఫిర్యాదు చేస్తానని దానం నాగేందర్ వెల్లడించారు.