Sat. Dec 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 12, 2024: భారతదేశంలో అత్యంత అభిమానించబడిన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్‌లలో ఒకటైన మిఆ బై తనిష్క్, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జోరా బార్ అండ్ కిచెన్‌లో ప్రత్యేక వేడుకను నిర్వహించింది.

మిఆ బై తనిష్క్ నేషనల్ సేల్స్ అండ్ రిటైల్ హెడ్రా జీవ్ సి మీనన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది, అందులో మిఆ బ్రాండ్‌పై గాఢ విశ్వాసం ఉన్న కస్టమర్లు పాల్గొన్నారు. ఈ వేడుక ద్వారా హైదరాబాద్ నగరంలోని తమ ప్రతిష్టాత్మకమైన కస్టమర్లకు బ్రాండ్ తన అంకితభావాన్ని స్పష్టం చేసింది.

హైదరాబాద్ నగరం, కాస్మోపాలిటన్ ప్రొఫైల్,భారీ స్థాయి జెన్ జెడ్, మిలీనియల్ కస్టమర్ బేస్‌ ఉన్న ప్రాంతంగా, మిఆ బై తనిష్క్‌కి ఒక ముఖ్యమైన మార్కెట్‌గా ఉంది. ఆధునికత,సంప్రదాయాల సమ్మేళనం ఉండటంతో పాటు సాంకేతికత, కన్సల్టింగ్ కేంద్రంగా ఉన్న నగరం, మిఆ బ్రాండ్ వ్యూహాత్మక విస్తరణలో కీలక పాత్ర పోషిస్తోంది.

పండుగల సీజన్ బతుకమ్మ, దసరా, దీపావళి వంటి వేడుకలతో దగ్గరపడుతున్నందున, మిఆ బై తనిష్క్ ఆకర్షణీయమైన, ట్రెండీ ఆభరణాలను అందిస్తూ కస్టమర్లకు పండుగ స్ఫూర్తిని పొందే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ వినియోగదారులు మాడ్యులర్,లైట్ వెయిట్ డిజైన్‌లను ఎక్కువగా కోరుకుంటున్నారు.

ఇవి రోజువారీ ధారణకు సరిపడే సొగసైన ఆభరణాలను అందిస్తూ నగరవాసుల అభిరుచిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కస్టమర్లు ధరించిన ఆభరణాల విశేష సమ్మేళనం పండుగ సందర్భాలు,రోజువారీ ధరింపుకు అనుగుణంగా ఉండటమే కాకుండా, వినియోగదారుల అవసరాలను తీర్చడానికి బ్రాండ్ యొక్క సన్నద్ధతను స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా మిఆ బై తనిష్క్ నేషనల్ సేల్స్ అండ్ రిటైల్ హెడ్ రాజీవ్ సి మీనన్ మాట్లాడుతూ, “మిఆ బై తనిష్క్‌కు ప్రధానమైన మార్కెట్ అయిన హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా కస్టమర్లు మాకు కీలకమైన వారిగా ఉంటారు.

అద్భుతమైన ఆభరణాలు, అసాధారణమైన అనుభవాన్ని అందించడంలో మేం నిబద్ధత చూపిస్తాము. హైదరాబాద్ నగరంలోని మా 10 ప్రత్యేకమైన స్టోర్‌లతో మేం మా కార్యకలాపాలను బలోపేతం చేయడం. ప్రముఖ ఫైన్ జ్యువెలరీ బ్రాండ్‌గా ఎదగడంపై దృష్టి పెట్టాం. నగరవాసులు ఆధునికతతో సాంస్కృతిక వైభవాన్ని మిళితం చేసే ఆభరణాలను కోరుతున్నారు” అన్నారు.

హైదరాబాద్‌లోని మిఆ కస్టమర్లు, మిఆ కమ్యూనిటీతో కలిసి తాజా కలెక్షన్లను వీక్షించేందుకు ఈ ప్రత్యేక సాయంత్ర వేడుక సమ్మేళనంగా నిలిచింది. కస్టమర్లు మిఆ బ్రాండ్ ఆభరణాలను ధరించి, మిఆ మహిళల స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ర్యాంప్‌పై నడిచారు.

error: Content is protected !!