365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 9,2024: సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్ – ది హంటర్’. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదల కానుంది. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్‌తో పాటు, ఏషియన్ సునీల్, దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇక, సీడెడ్ ఏరియాలో ఈ చిత్రం శ్రీ లక్ష్మీ మూవీస్ ద్వారా విడుదల అవుతుంది. ఈ క్రమంలో బుధవారం జరిగిన ప్రెస్ మీట్‌లో ముఖ్యమైన వ్యాఖ్యలు ఉన్నాయి.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ:
“‘వేట్టయన్ ది హంటర్’ సినిమాను నేను, ఏషియన్ సునీల్ , దిల్ రాజు గారు కలిసి తెలుగులో విడుదల చేస్తున్నాం. ఈ మూవీకి ప్రధాన టైటిల్ ‘ది హంటర్’నే, అన్ని భాషల్లోనూ ఇదే టైటిల్ ఉండబోతోంది. హంటర్ అనేది ఈ చిత్రం కీలక అంశం. ఈ చిత్రంలో రజినీకాంత్ గారు, అమితాబ్ గారు, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం కనిపించబోతున్నది. టి.జె. జ్ఞానవేల్ గారు సెన్సిబుల్ డైరెక్టర్. ఈ చిత్రంలో రజినీకాంత్ గారు కొత్తగా కనిపిస్తారు, అనిరుధ్ కూడా అలా చెబుతున్నారు. డబ్బింగ్ సినిమాలు గతంలో తక్కువ ప్రాధాన్యం పొందినప్పటికీ, ఇప్పుడు అన్ని భాషల్లో విడుదలవుతున్నాయి. మనం అన్ని భాషల చిత్రాలను ప్రోత్సహిస్తున్నాము. అందరూ సినిమాలను థియేటర్లో వచ్చి చూడాలని ఆశిస్తున్నాం. మన తెలుగు చిత్రాలు ఇప్పుడు అన్ని భాషలలోకి వెళ్ళిపోతున్నాయి. బెంగాలీ ప్రేక్షకులు కూడా డబ్బింగ్ సినిమా చూడాలని అడుగుతున్నారు. డబ్బింగ్ చిత్రాల వల్ల లోకల్ టాలెంటుకు పనులు కూడా లభిస్తాయి. థియేటర్ కల్చర్‌ను కాపాడాలి, ‘వేట్టయన్’ సినిమా థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను. అందరికీ కొత్త అనుభవం వస్తుంది.”
దిల్ రాజు మాట్లాడుతూ:
“లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని మేం ముగ్గురం కలిసి విడుదల చేస్తున్నాం. ప్రారంభంలో ‘వేటగాడు’ అనే టైటిల్ పెడదామని అనుకున్నాం, కానీ అది ఇప్పటికే ఇతరులకు ఉంది. మొదటిలో కేవలం తమిళ భాషలో మాత్రమే టైటిల్స్ పెట్టాలని అనుకున్నాం, కానీ ఇప్పుడు సినిమా గ్లోబల్‌గా మారిపోయింది. అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సినిమా బాగుంటే ఎలాంటి టైటిల్ పెడితేనూ ఆడియెన్స్ చూసే వాళ్లే. జై భీం వంటి అద్భుతమైన సినిమాను తీసిన టి.జె. జ్ఞానవేల్ ఈ సినిమాను కూడా అద్భుతంగా తీశారు. దసరా సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల అవుతుంది. కుటుంబంతో కలిసి అందరూ ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయగలరు.”

రానా దగ్గుబాటి మాట్లాడుతూ:
“సినిమాకు భాషలు లేవు, హద్దులు లేవు. కథ ఆధారంగా, సినిమా ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఇప్పటి వరకు రజినీకాంత్ గారు చేసిన సినిమాలన్నిట్లో ‘వేట్టయన్’ చాలా ప్రత్యేకమైనది. ఈ సినిమా ఒక భారీ తారాగణంతో వస్తోంది. రజినీకాంత్, అమితాబ్, ఫాహద్, మంజు వారియర్ ఇలా ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. రియలిస్టిక్ మూవీలో ఇన్ని గొప్ప పాత్రలు ఉంటాయి కంటే అరుదే. రజినీకాంత్ గారి ముందు నిలబడి డైలాగ్ చెప్పడం, నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టం. ఈ చిత్రాన్ని అందరూ చూసి ఎంజాయ్ చేయండి.”